లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాని మోడీ.. ‘నమామి గంగే’ మిషన్ కు ప్రైజ్ మనీ విరాళం..

Published : Aug 01, 2023, 02:20 PM IST
లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాని మోడీ.. ‘నమామి గంగే’ మిషన్ కు ప్రైజ్ మనీ విరాళం..

సారాంశం

లోకమాన్య తిలక్ అవార్డు ద్వారా అందిన ప్రైజ్ మనీని ప్రధాని నరేంద్ర మోడీ ‘నమామి గంగే’ మిషన్ అందజేస్తానని ప్రకటించారు. అవార్డు అందుకోవడం తనకు చిరస్మరణీయ ఘట్టమని చెప్పారు.

లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అందుకున్నారు. అయితే ఈ అవార్డుతో పాటు వచ్చిన ప్రైజ్ మనీని ప్రధాని ‘నమామి గంగే మిషన్ కు అందజేస్తున్నట్టు ప్రకటించారు. పూణేలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లోకమాన్య బాలగంగాధర తిలక్ పేరులోనే ‘గంగ’ ఉందని అన్నారు. అందుకే ఈ ప్రైజ్ మనీని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాని తెలిపారు. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మందికి అంకితమిస్తున్నానని ప్రకటించారు.

ఢిల్లీ ఆజాద్ పూర్ మండీలో రాహుల్ గాంధీ సందడి.. తెల్లవారుజామున చిరు వ్యాపారులతో ముచ్చట్లు

ఇది తనకు చిరస్మరణీయ ఘట్టమని అన్నారు. తన ప్రసంగంలో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. లోకమాన్య తిలక్ సావర్కర్ ను ఇంగ్లాండు నుండి బారిస్టర్ డిగ్రీని అభ్యసించడానికి ప్రోత్సహించారని అన్నారు. భారత స్వాతంత్ర్యంలో లోకమాన్య తిలక్ పాత్ర, ఆయన చేసిన కృషిని కొన్ని మాటల్లో చెప్పలేమని తెలిపారు. 

‘‘యువ ప్రతిభావంతులను గుర్తించడంలో లోకమాన్య తిలక్‌కు ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది, వీర్ సావర్కర్ అలాంటి ఒక ఉదాహరణ’’ అని ప్రధాని మోడీ అన్నారు. తనకు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందించినందుకు హింద్ స్వరాజ్ సంఘ్‌కి ధన్యవాదాలని తెలిపారు. 

సాయిబాబా దేవుడు కాదు.. హిందువులు ఆయన గుడికి వెళ్లొద్దు.. ఫొటోలు పారేయాలి - శంభాజీ భిడే వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా.. అంతకుముందు ఎన్సీపీ నేత శరద్ పవార్ తో కలిసి ప్రధాని మోడీ ఈ అవార్డు ప్రధానోత్సవ వేదికను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’లో ఎన్సీపీ చేరడం, ఇలాంటి పరిస్థితిలో జరిగిన ఈ కార్యక్రమంలో శరద్ పవార్, ప్రధాని మోడీ ఒకే వేధికపై కూర్చోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!