'ప్రేమ పెళ్లిళ్లకు  తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి'

Published : Aug 01, 2023, 01:51 PM IST
'ప్రేమ పెళ్లిళ్లకు  తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి'

సారాంశం

Love Marriage: ప్రేమ పెళ్లిళ్లపై గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనున్నది. ఇలాంటి పెళ్లిళ్లకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యానించారు.

Love Marriage: లవ్ మ్యారేజ్‌ అంటేనే.. ఒకనొకరూ ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకోవడం. కొంతమంది తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. మరికొందరూ  తల్లిదండ్రులు అవున్నా..  కాదన్నా.. ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే.. కొంతమంది  బలవన్మరణానికి పాల్పడుతారు. మొత్తానికి నానా యాతనలు పడుతారు. అటు ప్రేమికుల తల్లిదండ్రులు.. ఇటు ప్రేమికులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

అయితే.. ఇక నుంచి లవ్ మ్యారేజ్‌ చేసుకోవాలంటే.. కచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలనే కొత్త నిబంధన తీసుకరావాలని గుజరాత్‌ ప్రభుత్వం యోచిస్తోంది. దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పట్టనున్నది. ఈ విషయంపై స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. ప్రేమ వివాహం గురించి ఆయన ఇలా చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వీలైతే ప్రేమ వివాహాల్లో తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేసే అంశాన్ని తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని సీఎం పటేల్ చెప్పారు. 

మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ.. పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు వస్తున్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. తన పిల్లల ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని కోరుతున్నారని తెలిపారు.  ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని గుజరాత్ సీఎం పేర్కొన్నారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలన్న అంశానికి సంబంధించి రాజ్యంగం ప్రకారం అవకాశం ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామని చెప్పారు.
 
అనూహ్యంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రేమ పెళ్లిళ్లపై  రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే తాము మద్దతు తెలుపుతామని తెలిపింది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా మాట్లాడుతూ.. సీఎంకు మద్దతు పలికారు. రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే దీనిపై అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూస్తామని సీఎం భూపేంద్ర పటేల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి చట్టం తెస్తే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తీసుకువస్తే.. తాను కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తానని ఇమ్రాన్ ఖేదావాలా తెలిపారు. అంతకు ముందు.. 2021లో బిజెపి ప్రభుత్వం గుజరాత్ మత స్వేచ్ఛా చట్టాన్ని సవరించిందని, ఇందులో వివాహం ద్వారా బలవంతంగా, మోసపూరితంగా మారడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇందులో 10 ఏళ్ల శిక్ష విధించే నిబంధన ఉంది. అయితే ఈ చట్టంలోని వివాదాస్పద సెక్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !