మోడీకి ఘనస్వాగతం: కర్ణాటక బెళగావిలో ప్రధాని రోడ్ షో

Published : Feb 27, 2023, 03:18 PM ISTUpdated : Feb 27, 2023, 04:11 PM IST
మోడీకి ఘనస్వాగతం: కర్ణాటక బెళగావిలో  ప్రధాని రోడ్ షో

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఇవాళ పాల్గొన్నారు.  శివమొగ్గలో  ఎయిర్ పోర్టును   మోడీ ప్రారంభించారు. 

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సోమవారం నాడు  రోడ్ షో నిర్వహించారు.  రోడ్డుకు ఇరువైపులా  నిలబడి  ప్రజలు  మోడీకి అభివాదం  చేశారు.  

ఈ ఏడాది చివర్లో  కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. దీంతో   బెళగావి,  శివమొగ్గలో  ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  శివమొగ్గలో  విమానాశ్రయాన్ని ప్రధాని  ఇవాళ ప్రారంభించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కు   ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శివమొగ్గలో  విమానాశ్రయాన్ని ప్రారంభించిన  తర్వాత  బెళగావిలో  సుమారు  10 కి.మీ దూరం  ప్రధాని మోడీ  రోడ్ షో  నిర్వహించారు.

బెళగావి జిల్లాలో  సుమారు  18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బెళగావి ప్రాంతం  బీజేపీకి మంచి పట్టుంది.  గతంలో  ఈ జిల్లా నుండి   గెలిచిన కాంగ్రెస్, జనతాళత్  సెక్యులర్  ఎమ్మెల్యేలు  బీజేపీలో  చేరారు. అయితే  దీంతో  కొందరు  ఎమ్మెల్యేలపై  స్థానిక ప్రజల్లో  అసంతృప్తి నెలకొంది.  ఈ పరిణామాల నేపథ్యంలో  బెళగావిలో  ప్రధాని మోడీ  రోడ్ షో ను  బీజేపీ వ్యూహత్మకంగా  ఏర్పాటు చేసింది.  

 

ప్రధానమంత్రి  మోడీ సహ, బీజేపీ అగ్రనేతల  పర్యటనలను బెళగావి ప్రాంతంలో  ఉండేలా బీజేపీ నాయకత్వం  ప్లాన్  చేసింది. ఈ ఏడాది చివర్లో  కర్ణాటక అసెంబ్లీకి జరిగే  ఎన్నికలను  బీజేపీ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  దక్షిణాదిలో  కూడా  పట్టును పెంచుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది.  కర్ణాటకలో  మరోసారి అధికారాన్ని కైవసం  చేసుకోవాలని  పార్టీ నాయకత్వం  అడుగులు వేస్తుంది.  కర్ణాటకతో పాటు  తెలంగాణ అసెంబ్లీకి కూడా  ఈ ఏడాది చివర్లోనే  ఎన్నికలు జరగనున్నాయి. 
తెలంగాణ రాష్ట్రంలో కూడా  అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ  నాయకత్వం   ప్రనాళికలు రచిస్తుంది. 

also read:కమలం ఆకారంలో శివమొగ్గ విమానాశ్రయం.. విజువల్స్ ఇవే (వీడియో)

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  రేపు  ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  అనుసరించాల్సిన  వ్యూహంపై  చర్చించనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం