కమలం ఆకారంలో శివమొగ్గ విమానాశ్రయం.. విజువల్స్ ఇవే (వీడియో)

Published : Feb 27, 2023, 02:32 PM IST
కమలం ఆకారంలో శివమొగ్గ విమానాశ్రయం.. విజువల్స్ ఇవే (వీడియో)

సారాంశం

కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయం బీజేపీ ఎన్నికల గుర్తు కమలం పూవు ఆకారాన్ని పోలి ఉన్నది. ఈ ఎయిర్‌పోర్టును ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సంబంధించిన విజువల్స్ ఇలా ఉన్నాయి.  

న్యూఢిల్లీ: కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ఈ రోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కమలం పూవు ఆకారంలోని ఈ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించడం గమనార్హం. బీజేపీ సీనియర్ లీడర్, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప పుట్టిన రోజే (80వ జన్మదినం) ఆయన ఏరియా శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభమైంది.

సుమారు రూ. 450 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికుల వరకు హ్యాండిల్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నది. ఈ విమానాశ్రయం బీజేపీ ఎన్నికల గుర్తు కమలం పూవు ఆకారాన్ని పోలి ఉన్నది. కమలం పూవు ఆకారంలో ఉన్న ఈ విమానాశ్రయంపై పలువురు అభ్యంతరాలూ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డబ్బుతో ఒక పార్టీ గుర్తునూ ప్రచారం చేయడానికి అనుమతులు లేవని టాప్ కోర్టు అడ్వకేట్ ఒకరు ట్వీట్ చేశారు. ఈ నిర్మాణానికి పెట్టిన డబ్బులను బీజేపీ నుంచి రికవరీ చేసుకోవాలని సూచనలు చేయడం గమనార్హం.

 

Also Read: ప్ర‌ధాని మోడీ ప్రారంభించ‌నున్న శివమొగ్గ విమానాశ్రయానికి వ్య‌తిరేకంగా రైతుల ఆందోళ‌న‌లు

ఈ నేపథ్యంలో శివమొగ్గ ఎయిర్‌పోర్టు ఆకారంపై ఆసక్తి నెలకొంది. బీజేపీ నేతలు ఈ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన విజువల్స్‌ను సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు