
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో దీపావళి రోజు భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. పండుగ రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచిదని, అందుకే ఇలా చేశామని పూజారి శక్తి మహారాజ్ తెలిపారు. 1984లో తానే ఈ ఆచారాన్ని ప్రాంభించినట్టు తెలిపారు. కాళీమాత ఆశీర్వాదం వల్లే తాను ఇలా చేయగలుగుతున్నట్టు చెప్పారు. సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు నోట్లు ఇచ్చారు. ఆ సమయంలో గుడికి జనం పోటెత్తారు.
ఇదిలా ఉండగా, ప్రసాదం పేరుతో మోసం చేసిన ఓ ఘటన ఈ యేడు మార్చిలో హైదరాబాద్ లో వెలుగు చూసింది. దొంగతనాలు, మోసాలు చేయడంలో రోజులో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అంతకు ముందు ఇలా కూడా చేయచ్చని తెలియని రీతుల్లో దొంగతనాలకు పాల్పడుతూ.. తమ క్రియోటివిటీ చూపిస్తున్నారు మోసగాళ్లు. అలా సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో కొత్తరకం దొంగతనాలకు పాల్పడ్డారు కొంతమంది. వివరాల్లోకి వెడితే.. పూజలు చేసి ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారని నమ్మించి.. మహిళల మెడలో బంగారం చోరీ చేస్తోంది ఓ అంతర్రాష్ట్ర ముఠా.
బీహార్: ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత
నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ చందన దీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన గోవిండ్ మనోజ్ జాదవ్ (27) కన్నయ్యకిషన్ సాలుంకి (51), అశోక్ సురేష్ జాదవ్(44)లు బంధువులు. వీరి ప్రాంతంలో మధ్య నిషేధం ఉంది. దీంతో వీరు బయటినుంచి మద్యాన్ని తెచ్చి దొంగచాటుగా అమ్ముతుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతుంటారు. గతంలో పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. కొద్ది రోజుల క్రితం రైళ్లో నగరానికి వచ్చిన ఈ ముఠా.. లాడ్జీలో అద్దెకు దిగి చోరీలకు పథకం వేసింది.
శివరాత్రికి ముందు రోజు మోండా ఆదయ్యనగర్లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, మార్కెట్ లో పూజ సామాగ్రి కొని ఇంటికి వెడుతోంది. ఆమె వద్దకు ముగ్గురు ఒక్కసారిగా వచ్చారు. కాళ్లకు మొక్కారు. ఏమిటని ఆమె ప్రశ్నిస్తే.. పిల్లలు లేరని.. పిల్లలు పుట్టడానికి పూజలు చేయించామని, ఆ ప్రసాదం ఐదుగురు ముత్తాయిదువులకు ఇవ్వాలని పండితులు చెప్పారని నమ్మించారు. మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. అది తిని ఆమె అక్కడే పడిపోయింది. ఆమె వద్ద ఉన్న 7 తులాల బంగార నగలతో ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకున్నారు. నగలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించారు.