విదేశీ జంతువుల అక్రమ రవాణా... ప్రయాణికుడి అరెస్ట్...!

Published : Oct 26, 2022, 09:32 AM IST
  విదేశీ జంతువుల అక్రమ రవాణా... ప్రయాణికుడి అరెస్ట్...!

సారాంశం

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని థాయ్‌లాండ్‌కు పంపించారు. ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

విదేశీ జంతువుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నై ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

చెన్నై కస్టమ్స్ అధికారులు ఆదివారం బ్యాంకాక్ నుండి చెక్-ఇన్ బ్యాగేజీలో అక్రమంగా తరలిస్తున్న ఐదు విదేశీ జంతువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ జంతువులన్నీ మరిగుజ్జు జంతువులు అంటే... పరిమాణంలో చిన్నవి. దీంతో... వాటిని సంచిలో పెట్టుకొని తీసుకొని రావడం గమనార్హం.  బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని థాయ్‌లాండ్‌కు పంపించారు. ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

సాధారణ మరగుజ్జు ముంగూస్ అంగోలా, ఉత్తర నమీబియా, దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్, జాంబియా, తూర్పు ఆఫ్రికాకు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది పసుపు ఎరుపు నుండి చాలా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మృదువైన బొచ్చు, పెద్ద  తల, చిన్న చెవులు, పొడవాటి తోక కలిగి ఉంటాయి.


వైట్ కస్కస్ అని కూడా పిలువబడే సాధారణ మచ్చల కస్కస్ ఆస్ట్రేలియాలోని కేప్ యార్క్ ప్రాంతం, న్యూ గినియా సమీపంలోని చిన్న ద్వీపాలలో నివసించే జంతువు.  ఇది ఒక సాధారణ పిల్లి పరిమాణంలో ఉంటుంది. గుండ్రని తల, చిన్న  చెవులు, మందపాటి బొచ్చు, అధిరోహణలో సహాయపడే తోకను కలిగి ఉంటుంది. దాని కళ్ళు పసుపు, నారింజ నుండి ఎరుపు రంగులో ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం