నేడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న మల్లికార్జున్ ఖర్గే.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకార వేడుకలు..

Published : Oct 26, 2022, 08:59 AM IST
నేడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న మల్లికార్జున్ ఖర్గే.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకార వేడుకలు..

సారాంశం

137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఇటీవల పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార వేడుకలు జరగనున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 24 ఏళ్ల తర్వాత  గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. మల్లికార్జున్ ప్రమాణ స్వీకర వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు.

మేనబావ అని ఆశ్రయిస్తే.. మరదలిపై ఐదేళ్లుగా పోలీసు అత్యాచారం, అయిదుసార్లు అబార్షన్.. చివరికి...

ప్రమాణ స్వీకారం చేపట్టే కార్యక్రమం కంటే ముందుగానే మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు ఖర్గే బుధవారం ఉదయం రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ స్మారక చిహ్నాలను కూడా ఆయన సందర్శిస్తారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అధికారికంగా ఎన్నికల సర్టిఫికెట్‌ను ఖర్గేకు అందజేయనున్నారు. అనేక రాష్ట్రాల నుండి కాంగ్రెస్‌ను గద్దె దించిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటున్న ఈ తరుణంలో 80 ఏళ్ల ఖర్గే పార్టీ నాయకత్వాన్ని స్వీకరించనున్నారు.

చిరిగిన రూ.20 నోటు కోసం వాగ్వాదం.. మంటలంటుకుని మహిళ మృతి..

కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మూడు వేర్వేరు హోదాల్లో పనిచేసిన ఖర్గే.. పార్టీ అస్థిరంగా ఉన్న సమయంలో తన కొత్త పాత్రను పోషించనున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే అధికారంలో ఉంది. అలాగే జార్ఖండ్‌లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయడం ఖర్గే ముందున్న మొదటి సవాళ్లు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికల తేదీలపై ఇంకా ప్రకటన రాలేదు.

మహిళలను 'ఐటెమ్' అని పిలువడం నేరమే.. నిందితుడికి ఏడాదన్న జైలు శిక్ష విధించిన ముంబాయి కోర్టు

2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరుఫున నాయకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ రాష్ట్రం నుంచి ఖర్గే తొమ్మిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా.. వరుస పరాజయాలు, అంతర్గత కుమ్ములాటలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను వీడిన ప్రస్తుత తరుణంలో ఆయన పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం