
చత్తీస్‌గఢ్ : పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. అలాంటి ఘటనే చత్తీస్‌గఢ్ లో ఒకటి వెలుగు చూసింది. బండి మీదినుంచి పడబోతున్న వ్యక్తిని కాపాడానికి ప్రయత్నించిన తండ్రీ కొడుకులను దోచుకున్నారు దొంగలు. ఈ ఘటనతో వారు షాక్ అయ్యారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే....
చత్తీస్‌గఢ్ రాజధాని నగరం రాయ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. బైక్‌పై వెడుతున్న ఇద్దరు వ్యక్తులు బ్యాలెన్స్ తప్పి కింద పడబోయారు. వారిని చూసిన ఓ తండ్రీ కొడుకులు సహాయం చేయడానికి పరుగెత్తారు. కానీ, ఆ తరువాత జరిగింది వారిని షాక్ కు గురి చేసింది. బైక్ పడిపోవడం ప్లాన్. అలా ప్లాన్ చేసి, కాపాడడానికి వచ్చిన తండ్రి,కొడుకులకు కత్తి చూపించి దోచుకున్నారు.
Raksha Bandhan: దేశ సౌభ్రాతృత్వం, మత సంబంధాల బలోపేతమే రక్షా బంధన్
రాయ్‌పూర్‌లోని సరస్వతి నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మొత్తం అక్కడున్న నిఘా వీడియోలో నమోదయ్యింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కింద పడిపోతున్నట్లు నటించారు. దీనికంటే ముందు వారు తమ వెనుక ఇద్దరు వస్తుండడం పిలియన్ రైడ్ చేస్తున్న వ్యక్తి గుర్తించాడు. వెంటనే బండి నడుపుతున్న వ్యక్తిని అలర్ట్ చేశాడు. అతను బండి అదుపుతప్పి పడిపోతున్నట్లు నటించాడు.
ద్విచక్రవాహనదారుల వెనుక వెళ్తున్న బాధితులు వాహనాన్ని పైకి లేపేందుకు సహకరించారు. వెంటనే పిలియన్ రైడర్ కత్తిని బయటకు తీసి బెదించారు.
తండ్రి, కొడుకు వారికి సహాయం చేసిన తర్వాత వెళ్లడానికి ప్రయత్నించగా, దొంగల్లో ఒకరు వారిని దూరంగా నెట్టి.. కత్తి బైటికి తీయడం విజువల్స్ లో కనిపిస్తుంది.
వారినుంచి తప్పించుకుని కొడుకు పారిపోయాడు, కానీ, అతని తండ్రి మాత్రం ఇద్దరు దొంగల చేతికి దొరికిపోయాడు. వారు అతడిని నేలపై పడుకోబెట్టి జబర్దస్తీ చేశారు. కానీ, తండ్రీకొడుకును ఎదురు తిరిగి పోరాడి సురక్షితంగా బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు కత్తి చూపించి మరొకరిని కూడా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
బాధితురాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. బాధితురాలు ఫిర్యాదు చేయనప్పటికీ ఘటనా స్థలానికి వెళ్లి విచారించామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో విజువల్స్ అస్పష్టంగా ఉన్నందున బైక్ నంబర్‌ను నమోదు చేయడం కష్టంగా ఉందని, అయితే ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.