నెల రోజుల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక స్కీమ్: నిర్మలా సీతారామన్

By narsimha lodeFirst Published May 14, 2020, 5:44 PM IST
Highlights

రానున్న నెల రోజుల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్కీమ్ ను ప్రారంభించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 

న్యూఢిల్లీ:రానున్న నెల రోజుల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్కీమ్ ను ప్రారంభించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గురువారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.చిన్న వ్యాపారులకు రూ. 5వేల కోట్లతో రుణాలు అందించనున్నామన్నారు. 

ముద్ర యోజన కింద ఇప్పటికే 1లక్షా 62 వేల కోట్లు మంజూరు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. రూ. 50 వేల లోపు రుణాలు తీసుకొన్న వాళ్లు సకాలంలో రుణాలు చెల్లిస్తే 2 శాతం వడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

also read:వలస కూలీలకు ఉపాధి పనులు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు: నిర్మలా సీతారామన్

దేశంలోని  50 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 5 వేల కోట్ల సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముద్ర శిశు రుణాలు తీసుకొన్నవారికి రూ. 1500 కోట్ల మేర వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి మరిన్ని రాయితీలు అందిస్తామన్నారు. 

6 వేల కోట్లతొో ఆదీవాసీలు, గిరిజనులకు  ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టుగా మంత్రి వివరించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను రాయితీ రేట్లపై వలస కూలీలకు అందించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ. 4200 కోట్ల రుణాలు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

click me!