
చంద్రయాన్ 3కి ప్రయోగానికి సంబంధించి ఇస్రో సంచలన విషయాలను బహిర్గతం చేసింది. నాసాకు కూడా దొరకని సమాచారాన్ని చంద్రయాన్ సేకరించింది. చంద్రుడిపై వున్న ఖనిజాల సమాచారాన్ని గుప్పిట పట్టింది ప్రగ్యాన్ రోవర్. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న రోవర్ అక్కడ ఏం మినరల్స్ వున్నాయో శోధించి ఇస్రోకు తెలిపింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు వున్నాయని రోవర్ రీసెర్చ్‌లో తేలింది. ఒక్క ఆక్సిజనే కాదు.. కాల్షీయం, ఐరన్, క్రోమియం, టైటానియం, అల్యూమినియం, సల్ఫర్, మాంగనీస్, సిలికాన్ ఆనవాళ్లు వున్నాయని ఇస్రో వెల్లడించింది. హైడ్రోజన్ ఆనవాళ్లపై రోవర్ పరిశోధన కొనసాగుతోంది.
ప్రగ్యాన్ రోవర్‌లో అమర్చిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం.. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై సల్ఫర్ వుందని ఖచ్చితంగా గుర్తించింది. అలాగే చంద్రుడిపై వున్న మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు అక్కడ రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ పరికరాన్ని రంగంలోకి దింపింది ఇస్రో.