
మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (అందాల పోటీకి)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీ 27 ఏండ్ల తర్వాత భారతదేశంలో నిర్వహించబడుతున్నాయి. రెండు నెలల క్రితం శ్రీనగర్‌లో జరిగిన టూరిజంపై G-20 సమావేశం తర్వాత ఇది హై ప్రొఫైల్ ఈవెంట్. డిసెంబరు 9న అందాల పోటీలు జరుగనున్నాయి. ఈ తరుణంలో పోలాండ్‌కు చెందిన ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కా కాశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. ఈ కాశ్మీరీ లోయలోని ప్రకృతి అందాలకు ప్రపంచ సుందరి మంత్రముగ్ధులైంది. సుందరమైన రమణీమైన ప్రాంతాలపై తన మనసు పడేసుకుంది.
ఈ సందర్భంగా కరోలినా మీడియాతో మాట్లాడుతూ.. "భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాన్ని(కశ్మీర్) చూసే అవకాశం లభించినందుకు నేను అదృష్టవంతురాలిని. నేను అస్సలు ఊహించలేదు. ఇక్కడి ప్రకృతి అందాలకు చూసిన నన్ను మాయమారిచిపోయా.. చాలా ఆశ్చర్యపోయాను. కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల గురించి విన్నాను. కానీ నేను మొదటి సారి చూశాను. నిజంగా నా మనసులో అవి చేరుకని ముద్రవేశాయి. ఇక్కడ వారందరూ మమ్మల్ని చాలా చక్కగా, చాలా ఆప్యాయంగా స్వాగతించారు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులందరినీ ఈ ప్రాంతానికి తీసుకురావాలని, కాశ్మీర్ లోని పలు అద్బుత ప్రదేశాలను చూపించాలని చాలా అత్రుతగా ఉన్నా.. భారత్ లో పర్యటించడం ఇది మూడోసారి. అంతకుముందు ఢిల్లీ, ముంబై లను సందర్శించాను. గత పర్యటనలో కంటే ఈ పర్యటనలో చాలా సంతోషంగా ఉన్నాను. భారత్ కు వచ్చిన ప్రతిసారీ కొత్తదనాన్ని ఆస్వాధిస్తున్నా.. భారత్ చాలా వైవిధ్యమైనది. ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకం. ఇది అద్భుతమైన ఆతిథ్య ప్రదేశమిది." అని పేర్కొన్నారు.
అనంతరం.. మిస్ ఇండియా సిని శెట్టి, మిస్ వరల్డ్ కరీబియన్ ఎమ్మీ పెనాతో కలిసి కాశ్మీరీ హస్తకళలు,కళల ప్రదర్శనను సందర్శించారు. కాసేపు షాపింగ్ చేశారు. ఈ సమయంలో కాశ్మీర్ సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించారు. అంతే కాదు జీలం నదిని వీక్షించి ఆనందించారు.
ఈ పర్యటన గురించి పీఎంఈ ఎంటర్‌టైన్‌మెంట్ చైర్మన్ జమీల్ సైదీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశాని ప్రత్యేకంగా నిలిచిన కాశ్మీర్ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి వ్యక్తులు, ప్రకృతి దృశ్యాలు నన్ను ఎంతోగానో ఆకర్షించాయి. భారత్ నిజంగా భిన్నత్వంలో ఏకత్వం దేశం. ఈ అద్భుతమైన ప్రదేశానికి స్వాగతం పలికినందుకు మేము కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.
అదే సమయంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ & సీఈఓ మిస్ జూలియా మోర్లీ మాట్లాడుతూ.. “లోయ సందర్శన సమయంలో అపూర్వ అనుభవాన్ని అందించిన రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థకు ప్రత్యేక మా అభినందనలు. పోటీ హోల్డర్‌లతో శ్రీనగర్‌ని సందర్శించడం ఓ కొత్త అనుభవాన్ని అందించింది. మేము ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాము" అని అన్నారు.
కరోలినా బిలావ్స్కా
పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె పోలిష్ మోడల్, టీవీ ప్రెజెంటర్, సామాజిక కార్యకర్త, UN శాంతి గుడ్విల్ అంబాసిడర్, ప్రచారకర్త. భారతదేశం మిస్ వరల్డ్ 2023కి వేదిక కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకుంది. భారతదేశ విలువలు, సంస్కృతిని అన్వేషించాలని తాను కోరుకుంటున్నానని చెప్పింది.
ప్రపంచ పోటీలు ఎప్పుడూ భారత్ ప్రత్యేకమే. భారతదేశం ఆరుసార్లు ప్రపంచ సుందరి పోటీలో విన్నర్ గా నిలిచింది. 1966లో తొలిసారి రీటా ఫారియా మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోగా, 1994లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత డయానా హేడెన్ 1997లో ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. 1999లో యుక్తా ముఖీ ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకుంది. 2000లో ప్రియాంక చోప్రా కిరీటాన్ని గెలుచుకోవడంతో మళ్లీ మిస్ ఇండియా వరల్డ్ ను కైవసం చేసుకుంది. చివరిగా మానుషి చిల్లర్ ఆరో మిస్ ఇండియా వరల్డ్ గా నిలిచింది.