లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా రావొచ్చు: బిహార్ సీఎం నితీశ్ కుమార్

Published : Aug 29, 2023, 08:54 PM IST
లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా రావొచ్చు: బిహార్ సీఎం నితీశ్ కుమార్

సారాంశం

లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా రావొచ్చని బిహార్ సీఎం నితీశ్ కుమార్ కామెంట్ చేశారు. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న గ్యారంటీ లేదని, ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ముందస్తు ఎన్నికలనే ఊహించిన సంగతి తెలిసిందే.  

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరగొచ్చని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, బిహార్ సీఎం కూడా ముందస్తుగా లోక్ సభ ఎన్నికలు నిర్వహించవచ్చనే కామెంట్ చేయడంతో చర్చ తీవ్రతరమైంది. 

లోక్ సభ ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని నితీశ్ కుమార్ అన్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సిన షెడ్యూల్ ఉన్నదని, కానీ, షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. లోక్ సభ ఎన్నికలు నిశ్చితమైన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న గ్యారంటీ లేదని అన్నారు. ఎప్పుడైనా ఈ ఎన్నిలకు షెడ్యూల్ వెలువడొచ్చని పేర్కొన్నారు. 

ముందస్తు ఎన్నికలపై నితీశ్ కుమార్ కామెంట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్ చేశారు. 

Also Read: జర్నలిస్టు స్నేహ బెల్సిన్ కన్నుమూత.. కులం, లింగ వివక్షపై గళమెత్తిన యువకెరటం.. అంతలోనే!

ఒక్క రోజు క్రితమే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ముందస్తు ఎన్నికలనే అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉన్నట్టు తాను భావిస్తున్నానని వివరించారు. ఒక వేళ ఈ ఏడాది చివరిలోనే లోక్ సభ ఎన్నికలు జరగవచ్చనీ అన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా(INDIA)గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. త్వరలోనే ముంబయిలో ఈ ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?