విమాన ప్రయాణాలకు కేంద్రం సిద్ధం: మార్గదర్శకాలివే, ఖచ్చితంగా పాటించాల్సిందే..

By Siva Kodati  |  First Published May 12, 2020, 6:43 PM IST

లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలో రైళ్లు, బస్సులు, విమానాల వంటి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే రైల్వే శాఖ దశల వారీగా రైళ్లను పునరుద్దరించాలని నిర్ణయించింది


లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలో రైళ్లు, బస్సులు, విమానాల వంటి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే రైల్వే శాఖ దశల వారీగా రైళ్లను పునరుద్దరించాలని నిర్ణయించింది.

దీంతో పౌర విమానయాన శాఖ కూడా సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది. కొన్ని పరిమితులతో ప్రయాణికులను అనుమతించాలని భావిస్తోన్న ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. 

Latest Videos

undefined

విమాన ప్రయాణీకులకు సూచనలు:

* భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో మధ్యలో ఉండే సీట్లు ఖాళీగా ఉంటాయి. వాటిలో ఏ ప్రయాణీకుడు కూర్చోకూడదు.

* ప్రయాణీకులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల తనిఖీ కూడా తప్పనిసరి కాదు. టెర్మినల్ గేట్ దగ్గర జన సందోహాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

* ప్రయాణీకుడు తన క్వారంటైన్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గత 30 రోజుల్లో కరోనా వ్యాధి బారినపడ్డారా..? అందుకు ఏమైనా చికిత్స తీసుకున్నారా..? తదితర వివరాలను అందజేయాల్సి  ఉంటుంది.

* ఒకవేళ క్వారంటైన్‌‌లో ఉంటే గనుక ఎయిర్‌పోర్ట్‌లో ఉండే ఐసోలేటెడ్ సెక్యూరిటీ చెకింగ్ యూనిట్‌ను సంప్రదించాలి.

* విమాన ప్రయాణీకులకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి.

* రెండు గంటల ముందు మాత్రమే ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు వచ్చే వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ లోపలికి అనుమతించరు. 

* ప్రయాణ సమయం గంట ముందు మాత్రమే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. 20 నిమిషాల ముందే గేట్లను మూసేస్తారు.

* ప్రయాణీకులు తమ వెంట ఎటువంటి లగేజ్‌ను తీసుకురాకూడదు ( 20 కేజీలకు మించి ఉండకూడదు. అదీ ఒక్క బ్యాగ్ మాత్రమే)
 

Also Read:

ఎయిరిండియా పైలెట్లకు తొలుత పాజిటివ్, ఆ తర్వాత నెగిటివ్: ట్విస్ట్ ఇదీ...

15 స్పెషల్ ట్రైన్‌లు.. పది నిమిషాల్లో టిక్కెట్లు ఖాళీ

click me!