కోలుకున్న మన్మోహన్ సింగ్.. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

By Siva KodatiFirst Published May 12, 2020, 5:40 PM IST
Highlights

అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు

అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.

Also Read:ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం మన్మోహన్‌ను ఎయిమ్స్‌ తరలించారు. కొత్తగా ఓ ఔషధాన్ని తీసుకోవడంతో మన్మోహన్‌కు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్చారు.

సోమవారం ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడటంతో ఐసీయూ వార్డుకు మార్చారు. అలాగే మన్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

Also Read:విజృంభణ: ఇండియాలో 70 వేల మార్కు దాటిన కరోనా కేసులు

ప్రస్తుతం మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 2009లో ప్రధానిగా ఉన్న సమయంలోనే మన్మోహన్ గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన మందులు వాడుతూ వస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచి పలువురు నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు. 

click me!