ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే.. బీజేపీ పైనుండే నురుగు.. గాడ్సే భావజాలాన్ని ఓడించాలంటే..: ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Oct 30, 2022, 7:24 PM IST
Highlights

ఒక కప్పులోని కాఫీతో బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పోల్చారు. పై నురుగ బీజేపీ అయితే.. అసలైన కాఫీ ఆర్ఎస్ఎస్ అని వివరించారు. అందుకే గాడ్సే భావజాలాన్ని ఓడించాలని మహాత్ముడి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని తెలిపారు.
 

న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను కాఫీతో పోల్చారు. కప్పులో కాఫీ ఆర్ఎస్ఎస్ అని, ఆ కాఫీపై కనిపించే నురుగు బీజేపీ అని వివరించారు. అందుకే వాస్తవమైనది ఆర్ఎస్ఎస్ మాత్రమే అని తెలిపారు.

బిహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లౌరియాలో ఈ పోలిక తీశారు. అక్కడ మాట్లాడుతూ, నాథురాం గాడ్సే భావజాలాన్ని కేవలం మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు జవసత్వాలు ఇచ్చే ఓడించగలం అనే విషయాన్ని తాను రియలైజ్ అయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నా అని వివరించారు. ఆ దిశగా తాను మొదటి నుంచీ పని చేస్తే బాగుండేదని అన్నారు. నితీష్ కుమార్, జగన్ మోహన్ రెడ్డిలు వారి లక్ష్యాలను తెలుసుకునేలా వెచ్చించే సమయాన్ని ఇందుకు ఉపయోగించాల్సిందని పేర్కొన్నారు.

Also Read: బీజేపీతో టచ్‌లోనే నితీశ్ కుమార్‌.. మళ్లీ చేతులు కలుపొచ్చు: ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు

సంయుక్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని ఓడించగలమనే వాదనపై అప్రమత్తంగా వ్యవహరించే ప్రశాంత్ కిశోర్ ఎప్పుడూ ఒక వ్యాఖ్య చేస్తుంటారు. బీజేపీని అర్థం చేసుకోలేనివారు.. దాన్ని ఓడించలేరని చెబుతుంటారు.

‘మీరు ఎప్పుడైనా ఒక కప్పులోని కాఫీని చూశారా? పై భాగంలో నురుగు ఉంటుంది. బీజేపీ అలాంటిదే. కానీ, దాని కిందే లోతైన నిర్మాణంతో ఉండే ఆర్ఎస్ఎస్ ఉంటుంది. సంఘ్ సామాజికంగా చొచ్చుకుని వెళ్లింది. దాన్ని షార్ట్‌కట్‌లతో బీట్ చేయలేం’ అని వివరించారు. 

Also Read: కలిసి చాయ్ తాగినంత మాత్రానా ప్రతిపక్షాలను ఒక చోట చేర్చినట్టు కాదు: సీఎం నితీష్‌కు ప్రశాంత్ కిశోర్ కౌంటర్

గాడ్సే ఐడియాలజీ ని కేవలం గాంధీ కాంగ్రెస్‌ను పురుజ్జీవం చెందించి మాత్రమే ఓడించగలమని తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారనే వాదనలు కొన్నాళ్లు సాగాయి. కానీ, అది వాస్తవరూపం దాల్చలేదు. ఆయన ప్రస్తుత కాంగ్రెస్ కాకుండా.. మహాత్ముడి సమయంలోని కాంగ్రెస్ గురించే పైన పేర్కొన్నారు.

click me!