Published : Feb 06, 2025, 02:05 PM ISTUpdated : Feb 07, 2025, 09:24 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. విడాముయర్చి సినిమా రివ్యూ, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్  అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Telugu news live updates:  నేటి ప్రధాన వార్తలు

09:06 PM (IST) Feb 06

IND vs ENG ODI : ఇండియా చేతిలో ఇంగ్లాండ్ చిత్తు...టీమిండియా విక్టరీ

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 248 కే ఆలౌట్ అయ్యింది. 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.2 ఓవర్లలోనే చేధించింది టీమిండియా. ఈ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
 

06:54 PM (IST) Feb 06

Mahakumbh 2025: ప్రయాగరాజ్ కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద మహా హారతి (వీడియో)

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభ మేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది సాధువులు, సన్యాసులు, స్వామీజీలు తరలి వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి 144 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. అపూర్వమైన సంగమ హారతి అందుకొని తరిస్తున్నారు.

 

06:42 PM (IST) Feb 06

Harshit Rana : 6 4 6 4 0 6 చెత్త రికార్డ్, 1 1 W 0 0 W బెస్ట్ రికార్డ్ : ఆరంగేట్ర వన్డేలో అద్భుత అనుభవం

ఓ దశలో ఇంగ్లాండ్ వికెట్లేవి కోల్పోకుండా 7 ఓవర్లకే 70 పరుగులు చేసింది... ఓపెనర్లు మంచి టచ్ లో కనిపించారు. సాల్ట్ అయితే దూకుడుగా ఆడాడు. దీంతో భారత్ ముందు భారీ లక్ష్యం వుంటుందని అందరూ భావించారు. కానీ హర్షిత్ రాణా ఒకే ఒవర్ మ్యాచ్ స్వరూపాన్ని మలుపుతిప్పింది. పూర్తి కథనం చదవండి
 

05:16 PM (IST) Feb 06

IND VS ENG ODI: ఇంగ్లండ్ 248 పరుగలకు ఆలౌట్

ఇవ్వాళ జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.  ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్, లైవ కామెంటరీ, స్కోర్స్ కోం  కోసం

05:12 PM (IST) Feb 06

ఏపీ కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ (వీడియో)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రివర్గ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా అంశాలను ఏపీ హౌసింగ్, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు

 

05:03 PM (IST) Feb 06

రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో పేరు, ఏకంగా ఐలాండ్‌కే యజమాని, ప్రభాస్‌తో జతకట్టిన ఈ బ్యూటీ ఎవరంటే

సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. అయితే ఈ రంగుల్లోనూ కొన్ని డార్క్‌ షేడ్స్ కూడా ఉంటాయి. సినిమాలతో సమానంగా వివాదాలతోనూ వార్తల్లోకి ఎక్కిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? 
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

05:02 PM (IST) Feb 06

PM Modi in Rajya Sabha: కాంగ్రెస్ ది ఫ్యామిలీ ఫస్ట్ విధానం

రాష్ట్రపతి ప్రసంగాన్ని స్ఫూర్తిదాయకమైనదిగా, ప్రభావవంతమైనదిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. "సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్" గురించి చాలా మంది మాట్లాడారని, అయితే దీనిలో ఏ సమస్య ఉందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
"కాంగ్రెస్ నుంచి ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ ఆశించడం పెద్ద తప్పు. ఇది వారి ఆలోచనకు మించినది. ఇది వారి రాజకీయాలకు సరిపోదు, ఎందుకంటే ఆ పార్టీ మొత్తం ఒకే కుటుంబానికి అంకితమై ఉంటుంది," అని మోదీ మండిపడ్డారు. పూర్తి వార్త ఇక్కడ చదవండి

04:54 PM (IST) Feb 06

మచ్చా పెళ్లి కోసం ముంబై చేరుకున్న నిక్ జోనాస్

సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకలకు నిక్ జోనాస్ తల్లిదండ్రులతో ముంబై చేరుకున్నారు. ప్రియాంకా చోప్రా ఐవరీ లెహంగాలో మెహందీ, హల్దీ వేడుకల్లో కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సిద్ధార్థ్ షేర్వానీలో, నిక్ తండ్రి షేర్వానీలో, తల్లి కోరల్ చీరలో మెరిశారు. ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో నిండిపోయాయి. పూర్తి కథనం ఇక్కడ చదవండి

 

04:05 PM (IST) Feb 06

టిటిడిలో పనిచేస్తూ మతంమారిన ఉద్యోగుల ఫుల్ డిటెయిల్స్ ... ఇంతమంది ఉన్నారా!

హిందూయేతర టిటిడి ఉద్యోగులను తాజా పాలకమండలి గుర్తించింది... వీరిపై చర్యలు కూడా ప్రారంభించింది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 ప్రకారం హిందూ మతాచారాలను పాటించకుండా ఇతర మతాల్లో కొనసాగుతూ టిటిడి ఉద్యోగులుగా కొనసాగుతున్న 18 మందిపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

03:41 PM (IST) Feb 06

18మంది క్రిస్టియన్ ఉద్యోగులపై TTD చర్యలు.. బీజేపీ యామినీ శర్మ రియాక్షన్ ఇదే (వీడియో)

 

క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న 18 మంది ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. దీనిపై బిజెపి నాయకురాలు యామినీ శర్మ స్పందించారు. టీటీడీ చర్యలను స్వాగతించారు.

 

03:23 PM (IST) Feb 06

ఇండియన్‌ రైల్వేను మార్చిన ప్రయాణికుడు ఇబ్బంది.. కామెడీగా ఉన్నా చరిత్రను మలుపు తిప్పింది

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వే ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది ఇండియన్‌ రైల్వే. 170 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే ముఖచిత్రం మారడానికి ఒక కామెడీ సంఘటన కారణమైందని మీలో ఎంత మందికి తెలుసు.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

02:23 PM (IST) Feb 06

IND vs ENG ODI : ఇంగ్లండ్ బ్యాటింగ్.. టాప్ ఆర్డర్ ఖతం (Live score)

ఇవ్వాళ జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్, లైవ కామెంటరీ, స్కోర్స్ కోం  కోసం

02:18 PM (IST) Feb 06

ముంబైలో మన సీత | Actress Mrunal Thakur Snapped At Santacruz Mumbai (వీడియో)

సీతారామం మూవీతో సీతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. 2025లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు ఆమె. ఈ క్రమంలో ముంబైలో తళుక్కున మెరిసింది.

 

02:13 PM (IST) Feb 06

మహేష్‌ బాబు చేయాల్సిన కథ రామ్‌ చరణ్‌కి.. ఇప్పటి వరకు చూడని యాక్షన్‌ మూవీ

Mahesh babu-Ram Charan: ఒక హీరో చేయాల్సిన కథని మరో హీరో చేయడం కామన్‌గానే జరుగుతుంది. ఆ హీరో ఒప్పుకోకపోవడంతో మరో హీరోని దర్శకులు అప్రోచ్‌ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా మహేష్‌ బాబు చేయాల్సిన ఓ కథ ఇప్పుడు రామ్‌ చరణ్‌ వద్దకు వచ్చిందట. దీనికి ఆయన ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆ కథేంటి? ఆ దర్శకుడు ఎవరు? అసలేం జరిగిందనేది తెలియాలంటే.. 

02:07 PM (IST) Feb 06

Ajithkumar: అజిత్ 'పట్టుదల' సినిమా రివ్యూ

అజిత్ సినిమాలు తమిళంలో బాగానే ఆడుతున్నాను కానీ తెలుగులో ఈ మధ్యన అసలు వర్కవుట్ కావటంలేదు. దానికి తోడు ఇక్కడ మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదు. ప్రమోషన్స్ చేయటం లేదు. తాజాగా ఆయన హీరోగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'విడాముయ‌ర్చి' రిలీజైంది. పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


More Trending News