మహిళపై టీచర్, పోలీస్, ప్రభుత్వోద్యోగి గ్యాంగ్‌రేప్: బయటకు చెబితే నీ కూతురిని కూడా..

Siva Kodati |  
Published : Mar 06, 2020, 04:53 PM IST
మహిళపై టీచర్, పోలీస్, ప్రభుత్వోద్యోగి గ్యాంగ్‌రేప్: బయటకు చెబితే నీ కూతురిని కూడా..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై పోలీస్ అధికారి, ఉపాధ్యాయుడు, ప్రభుత్వోద్యోగి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా వారి దురాగతాన్ని వీడియో తీసి మహిళపై బెదిరింపులకు దిగారు.

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై పోలీస్ అధికారి, ఉపాధ్యాయుడు, ప్రభుత్వోద్యోగి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా వారి దురాగతాన్ని వీడియో తీసి మహిళపై బెదిరింపులకు దిగారు.

విషయం బయటికి చెబితే అత్యాచార దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అలాగే సదరు మహిళ కుమార్తెపైనా అత్యాచారం చేస్తామని చెప్పడంతో బాధితురాలు తన బాధను నెలల పాటు గుండెల్లోనే తొక్కిపెట్టింది.

Aslo Read:లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసు: 11 మందికి జీవిత ఖైదు, దోషులు వీరే

అయితే నిందితుల నుంచి వేధింపులు రోజు రోజుకి ఎక్కువ కావడంతో ఆమెలో సహనం నశించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో ఉన్నత గుర్తింపు ఉన్న టీచర్, పోలీస్, ప్రభుత్వోద్యోగి మహిళపై దారుణానికి తెగబడటం కలకలం రేపుతోంది.

కొద్దిరోజుల క్రితం తెలంగాణలో శివకుమార్ అనే కానిస్టేబుల్ ప్రేమ పేరిట ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు.

Also Read:అత్యాచారం, శీలానికి వెలకట్టి.. కండిషన్స్ పెడుతున్న పొలిటికల్ లీడర్

ఇదే సమయంలో మరో యువతి మెడలో తాళి కట్టడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను శివకుమార్ మోసం చేశాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?