మెడపై కత్తిపెట్టి బెదిరించి.. భార్య కోసం చీర దొంగతనం..!

Published : Jul 05, 2021, 10:35 AM IST
మెడపై కత్తిపెట్టి బెదిరించి.. భార్య కోసం చీర దొంగతనం..!

సారాంశం

 ఓ రోజు ఓ దుస్తుల దుకాణంలో ఆమెకు ఎర్ర చీర కనపడింది. అది అతనికి బాగా నచ్చింది. ఆ చీర ఎలాగైనా తన భార్యకు ఇవ్వాలని అనుకున్నాడు.

భార్య, పిల్లల కోసం.. డబ్బులు, నగలు దొంగతనం చేసిన దొంగల గురించి మీరు వినే ఉంటారు. అయితే...  ఓ వ్యక్తి మాత్రం  తన భార్య కోసం ఎర్రచీర దొంగతనం చేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ పాత నేరస్తుడు విక్కీ కి భార్య అంటే చాలా ప్రాణం. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఓ రోజు ఓ దుస్తుల దుకాణంలో ఆమెకు ఎర్ర చీర కనపడింది. అది అతనికి బాగా నచ్చింది. ఆ చీర ఎలాగైనా తన భార్యకు ఇవ్వాలని అనుకున్నాడు.

ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా  చీరల దుకాణంలోకి వెళ్లి కత్తి చూపించి హంగామా చేశాడు. అడ్డొచ్చిన వారిని బెదిరించాడు. ఆ సమయంలో షోరూములోని గల్లాపెట్టె కళకళలాడుతున్నా దాని జోలికి పోకుండా తనకు నచ్చిన ఎర్రచీరను తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. షోరూం యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని విక్కీగా తేల్చారు. 

అతడు పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై 16 కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇక తప్పించుకోవడానికి ఎంతమాత్రమూ వీలు లేకుండా విక్కీపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. విక్కీని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అతడు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. కాగా, చీర దొంగతనం చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport