పామును మెడకు చుట్టుకుని.. సైకిల్ యాత్ర.. ఈ వృద్ధుడి సాహసానికి నెటిజన్లు ఫిదా..

Published : Jul 05, 2021, 10:27 AM IST
పామును మెడకు చుట్టుకుని.. సైకిల్ యాత్ర.. ఈ వృద్ధుడి సాహసానికి నెటిజన్లు ఫిదా..

సారాంశం

 కర్ణాటక, బెళగావిలో ఓ వృద్ధుడు మాత్రం శివుడిలా పామును మెడకు చుట్టుకుని మరీ సైకిల్ సవారీ చేశాడు. ఇది బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో శనివారం మధ్యాహ్నం  చోటు చేసుకుంది.

మామూలుగా పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తాం. నిజానికి మనకు కనిపించే వాటిలో చాలావరకు విషరహితమైన పాములే. కానీ పాము అనే పేరే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అందుకే పాము కనిపిస్తే చాలు కర్ర పట్టుకుని వెంటపడతాం.. వాటిని చంపడమో, పట్టుకుని  దూరంగా వదిలేయడమో చేస్తాం. 

కానీ కర్ణాటక, బెళగావిలో ఓ వృద్ధుడు మాత్రం శివుడిలా పామును మెడకు చుట్టుకుని మరీ సైకిల్ సవారీ చేశాడు. ఇది బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో శనివారం మధ్యాహ్నం  చోటు చేసుకుంది.

దీన్ని ఓ ఔత్సాహిక యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. మెడలో పాముతో సైకిల్ మీద రివ్వున దూసుకెళ్లిన ఆ వృద్ధుడు గ్రామానికి సమీపంలోని తన పొల పక్కనున్న అడవిలో దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. 

అయితే ఆ పామును ఎక్కడ పట్టుకున్నాడు అనే వివరాలు తెలియవు కానీ.. మెడలో పాముతో వెడుతున్న అతన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. హంగరగా గ్రామస్తులు అతని వెంట పడుతూ.. పరుగులు తీశారు. వృద్ధుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం