దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. మరోసారి 40 వేల దిగువకు కేసులు..

By AN TeluguFirst Published Jul 5, 2021, 10:09 AM IST
Highlights

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఆదివారం 39, 796 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కేసులు క్రితం రోజు కంటే 7.6 శాతం క్షిణించడంతోపాటు మరోసారి 40 వేల దిగువకు పడిపోయాయి. 

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఆదివారం 39, 796 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కేసులు క్రితం రోజు కంటే 7.6 శాతం క్షిణించడంతోపాటు మరోసారి 40 వేల దిగువకు పడిపోయాయి. 

24 గంటల వ్యవధిలో 723 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3,05,85,229కి చేరగా.. మృతుల సంఖ్య 4,02,728గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 15,22,504 మంది నమూనాలను పరీక్షించారు.

ఇక క్రియాశీల రేటు 1.58 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.11 శాతానికి పెరిగింది. నిన్న 42,352 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.97 కోట్లకు చేరాయి. ప్రస్తుతం 4,82,071 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. మరోపక్క ఆదివారం 14,81,583 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 35,28,92,046కి చేరింది. 
 
click me!