పారిపోతున్న నిందితుడిపై పోలీసుల కాల్పులు... తీవ్రంగా గాయపడి, మరో కేసులో ఇరుక్కుని...

Published : Nov 17, 2021, 03:24 PM IST
పారిపోతున్న నిందితుడిపై పోలీసుల కాల్పులు... తీవ్రంగా గాయపడి, మరో కేసులో ఇరుక్కుని...

సారాంశం

ఎస్సై లింగరాజు పై దాడి చేసి రఘు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదాన్ని గమనించిన ఇన్స్పెక్టర్ వసంతకుమార్ లొంగిపోవాల్సిందిగా హెచ్చరిస్తూ తొలుత ఒక రౌండ్ గాలిలోకి firing జరిపాడు. అయితే దీనికి రఘు ఏమాత్రం బెదరలేదు. పారిపోతూనే ఉన్నాడు. అప్పటికీ లొంగక పోవడంతో నిందితుడు రఘు leg మీద కాల్పులు జరిపారు. 

బెంగళూరు :  బెంగళూరులోని హెన్నూరు పోలీస్ స్టేషన్  సబ్ ఇన్స్పెక్టర్ పై దాడికి పాల్పడి పరార్ అయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం జరిగింది.  నగరంలోని పిల్లా రెడ్డి నగర్ నివాసి raghu (30) ఓ murder caseలో నిందితుడిగా ఉన్నాడు.  ఈ నెల 13న మధ్యాహ్నం  12 గంటల సమయంలో గార్మెంట్ సంస్థ యజమాని  శ్రీధర్ కారులో వెళుతుండగా రఘు,  అతని సహచరులు వెంటాడి కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షల తోనే హత్య జరిగిందని తేల్చారు. murdered placeలో  మహజరుకు సంబంధించి హెణ్ణూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వసంత కుమార్, ఎస్ఐ లింగరాజు ఇతర సిబ్బంది బయలుదేరారు.

తమతో పాటు  ఈ కేసులో  key culpritగా ఉన్న రఘును కూడా తమతో పాటు మంగళవారం ఘటన ప్రదేశానికి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఎస్సై లింగరాజు పై దాడి చేసి రఘు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదాన్ని గమనించిన ఇన్స్పెక్టర్ వసంతకుమార్ లొంగిపోవాల్సిందిగా హెచ్చరిస్తూ తొలుత ఒక రౌండ్ గాలిలోకి firing జరిపాడు. 

అయితే దీనికి రఘు ఏమాత్రం బెదరలేదు. పారిపోతూనే ఉన్నాడు. అప్పటికీ లొంగక పోవడంతో నిందితుడు రఘు leg మీద కాల్పులు జరిపారు. గాయపడడంతో రఘు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో గాయపడ్డ రఘు దగ్గరికి చేరుకున్న పోలీసులు అతన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.  

అతడిని పరీక్షించిన అక్కడి వైద్యులు.. అతడికి ప్రాణాపాయం లేదని  తెలిపారు. అయితే కస్టడీలో ఉండి, పోలీసుపైనే కాల్పులకు తెగబడి, పారిపోవడానికి ప్రయత్నించిన accussed రఘు మీద తాజాగా పోలీసులు మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

అక్కమొగుడితోనే ఎఫైర్.. అది తోబుట్టువు తెలిసి నిలదీసిందని.. బావతో కలిసి ఉరివేసి... సూట్ కేస్ లో కుక్కి...

ఇదిలా ఉండగా ఛత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో కొద్దిరోజుల్లో పెళ్లి కాబోయే నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందింది.  జరిగింది. బిలాస్ పూర్  నగరంలో  ఇమ్లీ బాట ప్రదేశంలో సుఖ్ దేవ్ (58) తన భార్య కూతురు ప్రీతి (19)తో నివాసం ఉంటున్నాడు. సుఖ్ దేవ్ కు ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. వారంతా అదే వీధిలో పొరుగునే నివాసం ఉంటున్నారు. 

 గత సోమవారం తన ప్రీతి తల్లి తన కొడుకుల వద్దకు పొరుగు ఇంటికి వెళ్లగా.. ప్రీతి ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం sukhdev ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. ఎంత సేపు తట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో సుఖ్ దేవ్ పక్కనే ఉన్న తన కొడుకులకు కబురు పంపించాడు. వారంతా వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ప్రీతి dead body తన గదిలో వేలాడుతూ కనిపించింది. ఆమె చేతికి Blade తో కోసుకున్నట్లు రక్తపు మరకలు కూడా ఉన్నాయి. 

సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ప్రీతి ఉరివేసుకుని Suicide చేసుకుందా? లేక మరెవరో ఆమెను murder చేశారా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. preeti శవాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. ఇంతలో స్థానికులు చెప్పిన కొన్ని విషయాలు పోలీసుల్ని ఆలోచనలో పడేశాయి. చనిపోయేముందు ప్రీతిని అదే వీధిలో ఉన్న ఛోటు అనే యువకుడు నడిరోడ్డు మీద పట్టుకుని కొట్టాడు. ఆమె జుట్టుని లాగి పట్టుకుని ఈడ్చాడు. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్