ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూర్చుని రైతులను నిందిస్తారు.. ఢిల్లీ కాలుష్యం విచారణలో సుప్రీం సీరియస్

By telugu teamFirst Published Nov 17, 2021, 2:45 PM IST
Highlights

ఢిల్లీ కాలుష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టు వేడిగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా టీవీ డిబేట్లపై న్యాయవాదులు, న్యాయమూర్తులు మండిపడ్డారు. ఢిల్లీ కాలుష్యం కంటే టీవీ డిబేట్లు ఎక్కువ కాలుష్యం చేస్తున్నామని సీజే ఎన్వీ రమణ అన్నారు. కాగా, కొందరు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో సుఖంగా జీవిస్తూ రైతులను నిందిస్తుంటారని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. తాను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టు టీవీ డిబేట్లలో తనను నిందించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా పేర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
 

న్యూఢిల్లీ: దేశరాజధాని delhiని దట్టమైన కాలుష్య మేఘం కప్పేసింది. తీవ్ర వాయు Pollutionతో ఢిల్లీ తల్లడిల్లుతున్నది. ఈ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ స్టూడెంట్ Supreme Courtలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వరుసగా మూడో రోజూ వాదనలు విన్నది. పిటిషనర్ తరఫు న్యాయవాది, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల న్యాయవాదుల వాదనలు.. న్యాయమూర్తుల ప్రశ్నలతో కోర్టు హాల్ హీటెక్కింది. సుప్రీంకోర్టు ధర్మాసనం TV Debatesపై మండిపడింది. ఢిల్లీ కాలుష్యం కంటే టీవీ డిబేట్లు ఎక్కువ కాలుష్యం చేస్తున్నాయని మండిపడింది. అలాగే, Five Star Hotelsలో నింపాదిగా కూర్చుని ప్రతి దానికీ రైతులను నిందిస్తున్నారనీ ఆగ్రహించింది.

పొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే ఢిల్లీలో వాయుకాలుష్యం ఏర్పడుతున్నదని, ఢిల్లీ కాలుష్యంలో రైతుల పాత్రే ఎక్కువగా ఉన్నదనే చర్చ జరుగుతున్నది. దీనిపై గత విచారణలో కేంద్ర తరఫు న్యాయవాది తుషార్ మెహెతా ప్రస్తావించారు. రైతుల వ్యర్థాలకు నిప్పు పెట్టడం ఢిల్లీ కాలుష్యంలో ఏడు శాతం వరకు పాత్రపోషిస్తున్నదని ఆయన చెప్పారు. దీనిపై టీవీ డిబేట్‌లలో తనపై నిందలు మోపారని తుషార్ మెహెతా కోర్టుకు తెలిపారు. తాను సుప్రీంకోర్టును తప్పుదారి పట్టిస్తున్నట్టు డిబేట్లలో వాదిస్తున్నారని చెప్పారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ ఒక ప్రభుత్వ కార్యాలయానికి బాధ్యత వహిస్తున్నప్పుడు విమర్శలు ఎదుర్కొంటామని, దానిపై కలత పడాల్సిన అవసరం లేదని వివరించింది. తాము సంఖ్యలు పట్టించుకోవడం లేదని, రైతుల బాధను చూస్తున్నామని తెలిపింది. అంతేకాదు, రైతులపై నోరెత్తేవారు.. ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్‌ గురించి మాట్లాడరని పేర్కొంది. ఉద్దేశ్యం తప్పుకానంత వరకు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని భావించాల్సిన అవసరం లేదని తెలిపింది.

Also Read: Delhi Air Pollution: పూర్తి లాక్‌డౌన్‌కు సిద్దం.. సుప్రీం కోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం

తాము ఇక్కడ కాలుష్య నియంత్రణకు పరిష్కారాన్ని వెతుకుతుంటే.. అక్కడ ఎవరి అజెండా వారిదేగా పొంతన లేదని వాదనలు చేస్తున్నారని సీజే ఎన్వీ రమణ అన్నారు. నిజానికి ఈ డిబేట్లే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని ఆగ్రహించారు. అయితే, రైతులను శిక్షించాలని భావించడం లేదని అన్నారు. కనీసం ఒక వారం పాటైనా రైతులు పంట వ్యర్థాలను మండించకుండా విజ్ఞప్తి చేయాలని, వారిని ఒప్పించే మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే కేంద్రానికి తెలిపామని వివరించారు.

Also Read: రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు

పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చేయడానికి కొన్ని యంత్రాలను తీసుకువచ్చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా ఇటీవలే పేర్కొన్నారు. ఆ యంత్రాలను ద్వారా పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నివారించవచ్చని వివరించారు. తాజాగా, ఈ సూచనపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న లెక్కలకు అతీతంగా తాము రైతుల వేదనను చూస్తున్నామని తెలిపారు. రైతులు వాటిని మండించడానికి గల కారణాలు ఏమిటీ?.. వాటిని తగులబెట్టే స్థితికి రైతులు ఎందుకు నెట్టివేయబడ్డారు? అనే ప్రశ్నలపై ఎవరూ మాట్లాడబోరని మండిపడ్డారు. ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్స్‌లో సుఖంగా నిద్రపోయే కొందరు రైతులను నిందిస్తుంటారని అన్నారు. వారికున్న చిన్న చిన్న కమతాలను చూడండని.. వారు ప్రభుత్వం యోచిస్తున్న యంత్రాలను కొనగలరా? అని అడిగారు. కాగా, ఇలాంటి తక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాలపైనే చర్చిస్తూ పోతే అసలు సమస్య పక్కదారి పడుతుందని సీజే ఎన్వీ రమణ అన్నారు.

click me!