మరో మహిళతో తండ్రి అక్రమ సంబంధం... తట్టుకోలేని కొడుకు..

Published : Apr 03, 2020, 09:24 AM IST
మరో మహిళతో తండ్రి అక్రమ సంబంధం... తట్టుకోలేని కొడుకు..

సారాంశం

సోమవారం తండ్రి ప్రియురాలి ఇంటికి స్నేహితుడితో వెళ్లిన బాలుడు తండ్రితో సంబంధం వదులుకోవాలని ఆమెను హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన బాలుడు దుడ్డుకర్రతో మహిళ తలపై దాడి చేసి పరారయ్యాడు.   

అతని పెళ్లై దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే... అతను భార్యను కాదని మరో స్త్ర్రీ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా.. ఆ విషయం అతని కొడుక్కి తెలిసింది. దీంతో.. తట్టుకోలేక.. తండ్రి.. ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు.

Also Read వివాహిత కామవాంఛకు ఇద్దరు బలి: భర్త హత్య, ప్రియుడు ఆత్మహత్య...

ఈ సంఘటన తమిళనాడు రాష్ట్ర్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టుకోట్టై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు. ఇతనికి వివాహమై 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇలావుండగా బాలుని తండ్రికి, అదే ప్రాంతానికి చెందిన, ఓ వివాహిత (47)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

దీంతో సోమవారం తండ్రి ప్రియురాలి ఇంటికి స్నేహితుడితో వెళ్లిన బాలుడు తండ్రితో సంబంధం వదులుకోవాలని ఆమెను హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన బాలుడు దుడ్డుకర్రతో మహిళ తలపై దాడి చేసి పరారయ్యాడు. 

గాయపడ్డ మహిళను వెంటనే స్థానికులు పట్టుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందింది. పోలీసులు స్నేహితుడు సహా బాలున్ని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM