సీఎంని హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్

Published : Apr 02, 2020, 08:01 AM IST
సీఎంని హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్

సారాంశం

బిహార్‌ రోహ్‌తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియో చిత్రీకరించాడు.

బిహార్ సీఎం నితీశ్ కుమార్ ని హత్య చేయాలని.. అలా చేసిన వారికి రూ.25లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. కాగా.. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

బిహార్‌ రోహ్‌తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ చేశాడు. 

Also Read జీవితాంతం గుర్తుండాలని: పిల్ల పేరు కరోనా, పిల్లాడి పేరు లాక్‌డౌన్...

దీంతో విషయం తెలుసుకున్న రోహ్‌తాస్‌ పరిధిలోని దినారా స్టేషన్‌ హౌస్‌ పోలీసు ఆఫీసర్‌ సియారామ్ సింగ్.. ధర్మేంద్రను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా, పోస్టు చేసిన వీడియో, మొబైల్‌ నంబర్‌ అధారంగా నిందితుడు ఉన్న లోకేషన్‌ లూథియానాగా చేధించినట్లు సియారామ్‌ తెలిపారు. అదేవిధంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. దీనిపై రోహ్‌తాస్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సత్యవీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న లూథియానా పోలీసులు, ధర్మేంద్ర మానసిక స్థితి సరిగా లేదనే సందేశాన్ని తమకు పంపించారని తెలిపారు

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM