వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు భార్యలను హతమార్చడం, పెళ్లాలు మొగుళ్లను చంపిన ఘటనలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్తతో పాటు ప్రియుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా టి. నరసీపుర తాలూకా హోరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు అనే యువకుడికి ఓ మహిళతో వివాహమైంది. కొద్దిరోజుల వరకు వీరి సంసారం సజావుగానే సాగింది.

ఈ మధ్యలో మహాదేవ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్ధరాజు.. భార్యను పద్ధతిగా మార్చుకోవాల్సిందిగా హెచ్చరించాడు.

Also Read:భర్త దొంగని.. మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం..చివరకు..

తన సుఖానికి అడ్డొస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య... భర్తపై కక్ష పెంచుకుంది. ప్రియుడు మహాదేవతో కలిసి సిద్ధరాజును చంపేందుకు కుట్ర పన్నింది. ప్లాన్‌లో భాగంగా భర్తకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లిన వివాహిత ప్రియుడితో కలిసి సిద్ధరాజును కిరాతకంగా చంపింది.

వీరికి మహదేవ స్నేహితుడు సిద్ధప్ప సాయం చేశాడు. అందరూ కలిసి ఆధారాలు మాయం చేసేందుకు గాను వారు శవాన్ని ఓ చోట పూడ్చి పెట్టారు. ఆ వెంటనే ఆమె కొత్త నాటకం మొదలు పెట్టింది.

తన భర్త కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా వివాహిత ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది.

Also Read:మైనర్ బాలుడితో ఆంటీ ఎఫైర్... రాత్రంతా శృంగారం, తృప్తితీరక..

దీంతో వారు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తానే భర్తను హత్య చేశానని నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు వివాహితతో పాటు ఆమె ప్రియుడిపై హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంగతి తెలుసుకున్న మహాదేవ భయాందోళనకు గురై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హత్య కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాకయ్యారు. తన సుఖం కోసం ఇద్దరి చావుకు కారణమైన వివాహితను కఠినంగా శిక్షించాలని రెండు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.