గుజరాత్‌లో గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొననున్న డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్: స్వాగతమంటూ మోడీ ట్వీట్

Published : Aug 16, 2023, 03:14 PM IST
గుజరాత్‌లో  గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొననున్న డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్: స్వాగతమంటూ  మోడీ ట్వీట్

సారాంశం

ఈ నెలలో రెండు రోజుల పాటు  జరిగే  ట్రెడిషినల్ గ్లోబల్ సమ్మిట్ లో  పాల్గొనేందుకు  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్  డాక్టర్ టెడ్రోస్  ఇండియాకు వచ్చారు.ఆయనకు  స్వాగతం అంటూ  మోడీ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్  డాక్టర్ టెడ్రోస్ కు స్వాగతం తెలిపారు  ప్రధాని నరేంద్ర మోడీ. రెండు రోజుల పాటు జరిగే  ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్  ఇండియాకు  చేరుకున్నారు.  ఈ నెల  17, 18 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో  ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు  ఇండియాకు  వచ్చిన  డాక్టర్ టెడ్రోస్ కు  సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోడీ స్వాగతం పలికారు. 

తన ప్రియ మిత్రుడు తులసీబాయ్( డాక్టర్ టెడ్రోస్) నవరాత్రికి సిద్దమౌతున్నారని  మోడీ  ట్విట్టర్ లో పేర్కొన్నారు.  టెడ్రోస్ కు స్వాగతం అంటూ  ఆయన పేర్కొన్నారు. టెడ్రోస్ భారత సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా  దాండియా  చేస్తున్న  వీడియోను  ఆయుష్ మంత్రిత్వ శాఖ  ఓ వీడియోను  పోస్టు చేసింది.  డాక్టర్ టెడ్రోస్ కు  స్వాగతం అంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖ  పేర్కొంది. 

సంప్రదాయ ఔషద గ్లోబల్ సమ్మిట్  ను ఆయుష్ మంత్రిత్వ శాఖ  ఈ నెల  17, 18 తేదీల్లో  గాంధీనగర్ లో నిర్వహిస్తుంది. సంప్రదాయ వైద్యంలో  ఇండియా అగ్రగామిగా నిలిచేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ దోహదపడుతుందని  ఆయుష్ మంత్రిత్వశాఖ  అభిప్రాయంతో ఉంది. 

 

ఈ సమ్మిట్ ను  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్  ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా,  ఆయుష్ మంత్రి సర్భానంద సోనోవాల్ కూడ పాల్గొంటారు.  మరో వైపు జీ 20  దేశాలకు చెందిన ఆరోగ్య మంత్రులు, డబ్ల్యుహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్లు, ఆరు దేశాలకు  చెందిన ప్రముఖులను  ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?