PM Narendra Modi VS Rahul Gandhi : సోషల్ మీడియా రారాజు ఎవరు?

Siva Kodati |  
Published : Aug 12, 2023, 07:52 PM IST
PM Narendra Modi VS Rahul Gandhi : సోషల్ మీడియా రారాజు ఎవరు?

సారాంశం

దేశ రాజకీయాల్లో అత్యంత కీలక నాయకులైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. మరి వీరిద్దరిలో ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు వున్నారు.. ఎవరి పోస్ట్‌కు ఎంగేజ్‌మెంట్ ఎక్కువ అనేది చూస్తే.

ఈరోజు సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనసులో వున్న భావాలను పంచుకోవడానికి వచ్చిన ఈ మాధ్యమం.. ఇప్పుడు దేశాల అధినేతలను గడగడలాడిస్తోంది. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో అది వైరల్ అవుతోంది. ఇక రాజకీయాల్లోనూ సామాజిక మాధ్యమాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ నాయకులు , పార్టీలు ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా విమర్శించడానికి లేదా ఆరోపణలు చేయడానికి ఎంచుకునే మొదటి మార్గం సోషల్ మీడియా పోస్ట్. అయితే, ఇది ఏ ఖాతా నుండి పోస్ట్ చేయబడిందో కూడా అంతే కీలకం. మీకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే, ఆ పోస్ట్ అంత వైరల్ అవుతుంది. 

అందుకు తగ్గట్టుగానే నేతలు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో తమ ఆలోచనలను పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ‌లు మాట్లాడారు. ఈ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు మాట్లాడుతూ.. మోదీ ప్రసంగం లైవ్ ఫీడ్ కంటే రాహుల్ ప్రసంగం లైవ్ ఫీడ్‌కే ఎక్కువ స్పందన వస్తోందని అన్నారు. అయితే సోషల్ మీడియాలో రాహుల్ కంటే నరేంద్ర మోడీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.

ట్విట్టర్:

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాలో గత నెలలో 79.9 లక్షల ఎంగేజ్‌మెంట్‌లు నమోదయ్యాయి. కాగా, రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీ ఈ నెల వ్యవధిలో 23.43 లక్షల ఎంగేజ్‌మెంట్‌లను మాత్రమే నమోదు చేసింది. గత మూడు నెలల ట్విటర్ ఎంగేజ్‌మెంట్‌లను లెక్కిస్తే.. ప్రధాని ట్విట్టర్ పేజీలో 2.77 కోట్ల ఎంగేజ్‌మెంట్లు నమోదు కాగా, రాహుల్ ట్విట్టర్ ఖాతాలో 58.23 లక్షల ఎంగేజ్‌మెంట్లు వచ్చాయి. తద్వారా ట్విట్టర్‌లో ప్రధాని పేజీ పైచేయి సాధించింది.

ఫేస్‌బుక్:

ఫేస్‌బుక్‌లో గత నెలలో ప్రధాని మోడీ పేజీకి 57.89 లక్షల ఎంగేజ్‌మెంట్‌లు వచ్చాయి. రాహుల్ గాంధీ పేజీకి 28.38 లక్షల ఎంగేజ్‌మెంట్లు మాత్రమే వచ్చినట్లు ఫేస్‌బుక్‌లోనే సమాచారం. ఈ ఏడాది ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పేజీకి 3.25 కోట్ల మంది ఎంగేజ్‌మెంట్‌లు రాగా, మరోవైపు రాహుల్ గాంధీకి 1.88 కోట్ల మంది స్పందనలు వచ్చాయి.

యూట్యూబ్:

గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్‌లో గత నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ వీడియోలకు 25.46 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. రాహుల్ గాంధీ పేజీకి 4.82 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్‌కు ఈ ఏడాది దాదాపు 75.79 కోట్ల వ్యూస్ రాగా, రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానెల్‌కు ఈ ఏడాది దాదాపు 25.38 కోట్ల వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ప్రధాని మోదీ పేజ్ కింగ్ ‌గా నిలబడింది. 

ఇన్‌స్టాగ్రామ్:

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మరో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలి వీడియో వీక్షణలను పరిశీలిస్తే, రాహుల్ గాంధీ వీడియోలు ఏవీ 2 మిలియన్ వ్యూస్ దాటలేదు. మోడీ వీడియోలు చాలా వరకు 10 మిలియన్ల వీక్షణలను నమోదు చేశాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు