బస్సు డ్రైవర్‌పై బైకర్ దాడి .. నెట్టింట్లో వీడియో వైరల్..

Published : Aug 12, 2023, 06:00 PM IST
బస్సు డ్రైవర్‌పై బైకర్ దాడి .. నెట్టింట్లో వీడియో వైరల్..

సారాంశం

కర్ణాటకలోని మైసూరులో ఓ బైకర్.. రన్నింగ్ బస్సులోకి ప్రవేశించి బస్ డ్రైవర్ పై దాడి చేశాడు. ఆ నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు డ్రైవర్ పై దాడి చేసిన  ద్విచక్రదారుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తన బైక్ ను బస్సు ఢీ కొట్టినట్టు ఆ వ్యక్తి ఆరోపించారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనదారుడు బలవంతంగా బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ దాడిని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. నిందితుడు షారుఖ్ (30) గా గుర్తించారు. ఆ వ్యక్తి దుర్భాషలాడి డ్రైవర్‌ను బస్సు నుంచి బలవంతంగా బయటకు లాకే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో మైసూరులోని జిఎన్ రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో చోటుచేసుకుంది.

ఆ బస్సు బెంగళూరు వైపు వెళుతుండగా డ్రైవర్ పై దాడి జరిగినట్టు తెలిపారు. నిందితుడ్ని మైసూరు వాసిగా గుర్తించారు,  నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు షారుక్.. రన్నింగ్ బస్సులోకి బలవంతంగా ప్రవేశించడం. డ్రైవర్ పై దూర్బాషలాడుతూ..  బస్సు డ్రైవర్ ను బయటకు బలవంతంగా లాకే ప్రయత్నం చేశాడు. అలాగే.. డ్రైవర్ పై దాడి చేయడం కూడా చూడవచ్చు. ఈ క్రమంలో బస్సులో ఉన్నవారు ఆ ఆకతాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం