ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ .. మరోసారి అగ్రస్థానం, దరిదాపుల్లో లేని అగ్రరాజ్యాధినేతలు

Siva Kodati |  
Published : Jun 11, 2023, 07:37 PM IST
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ .. మరోసారి అగ్రస్థానం, దరిదాపుల్లో లేని అగ్రరాజ్యాధినేతలు

సారాంశం

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ మేరకు గణాంకాలు వెల్లడించింది. 

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ వున్న నాయకుల జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధిపత్యం కొనసాగుతోంది. మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దేశ దృక్పథం ప్రపంచ దేశాలలో ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే ప్రకారం.. 77 శాతం ఆమోదం‌తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోదీ మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 

 

 

ఆగస్ట్ 2019 నుండి మార్నింగ్ కన్సల్ట్ కంపైల్ చేస్తున్న గ్లోబల్ లీడర్‌షిప్ అప్రూవల్ ప్రాజెక్ట్ అమలులో ఉన్నప్పటి నుండి మోడీ 71 శాతం రేటింగ్‌ను కొనసాగించారు. 2022 నుండి ప్రధాని మోడీ రేటింగ్ 75% కంటే ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను ప్రధాని మోదీ ఎప్పుడో దాటేశారు. రేటింగ్ కోసం 22 ప్రపంచ నాయకులను సర్వే చేసిన పోల్ ప్రకారం 22 ప్రధాన దేశాలలో కేవలం నలుగురు ప్రపంచ నాయకులు మాత్రమే 50 శాతానికి పైగా రేటింగ్ పొందుతున్నారు. తాజా రేటింగ్‌లు మే 30  నుంచి జూన్ 6 మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించారు. 

ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్,  యునైటెడ్ స్టేట్స్ ‌దేశాలకు చెందిన నాయకులు, అక్కడి రాజకీయ పరిస్థితులను, జాతీయ పోకడలను సర్వే పరిగణనలోనికి తీసుకుంది. మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం.. రేటింగ్‌లు ప్రతిరోజూ 20,000 పైచీలుకు గ్లోబల్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలపై ఆధారపడి ఉంటాయి.  మార్నింగ్ కన్సల్ట్ అనేది అమెరికాకు చెందిన సంస్థ. ఆయా దేశాల్లో ప్రభుత్వాలను నడుపుతున్న నాయకుల ఇమేజ్‌పై డేటాను సేకరిస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌