రేపు ప్రధాని మోడీ ఫిట్ ఇండియా డైలాగ్‌: ప్రముఖుల స్పందన ఇది

By Siva KodatiFirst Published Sep 23, 2020, 10:13 PM IST
Highlights

ఫిట్ ఇండియా డైలాగ్ లో భాగంగా పలువురు క్రీడాకారులు, సినీనటులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ నెల 24 న ఫిట్ ఇండియా తొలి  వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ, మిలింద్ సోమన్, రుజుటా దివేకర్ తదితరులతో ఈ ఆన్‌లైన్ డైలాగ్‌లో మోదీ మాట్లాడనున్నారు.

ఫిట్ ఇండియా డైలాగ్ లో భాగంగా పలువురు క్రీడాకారులు, సినీనటులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ నెల 24 న ఫిట్ ఇండియా తొలి  వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ, మిలింద్ సోమన్, రుజుటా దివేకర్ తదితరులతో ఈ ఆన్‌లైన్ డైలాగ్‌లో మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం. 

 

Dal chawal ghee goes mainstream and i am excited to be a part of the . Looking forward to a free wheeling chat with Hon. PM ji and with fitness icons of India. Join us. https://t.co/95CoJ6UyCS

— Rujuta Diwekar (@RujutaDiwekar)

 

 

దీనిపై పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. భారత ఫుట్ బాల్ క్రీడాకారిణీ అదితి చౌహాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇండియన్ ఫుట్‌బాల్ నుండి ఒక మహిళా ప్రతినిధిని జాతీయ వేదికపై చూడటం చాలా బాగుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి కిరణ్ రీజిజు తదితరులతో కలిసి ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పిస్తుండటంత తనకు దక్కిన గౌరవంగా ఆమె ట్వీట్ చేశారు. 

రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కలుద్దామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. దాల్, చావల్, నెయ్యి ప్రజల ప్రధాన స్రవంతిలోకి వెళ్లబోతోందని ఫిట్ ఇండియా డైలాగ్‌లో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందని పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ట్వీట్ చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫిట్ ఇండియా సంభాషణ సెప్టెంబర్ 24 ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. ఈ ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి మోదీ తన ఆలోచనలను పంచుకుంటూ ఇతరుల ఫిట్‌నెస్ ప్రయాణం గురించి తెలుసుకుంటారు.

కొవిడ్ -19 మహమ్మారితో దేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫిట్‌నెస్ వైపు ప్రజలను మరింతగా ప్రేరేపించడానికి ఈ ఫిట్ ఇండియా డైలాగ్ ఉపయుక్తంగా ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. ఫిట్ ఇండియా డైలాగ్ భారతదేశాన్ని ఫిట్ నేషన్ గా మార్చేందుకు ఒక ప్రణాళికను రూపొందించడానికి దేశ పౌరులను చేర్చుకునే మరో ప్రయత్నం.

 

Join our Honourable PM and me at the Fit India Dialogue, tomorrow at 12 PM IST. See you there 🙌🏼 pic.twitter.com/Vf5LyTljyR

— Virat Kohli (@imVkohli)

 

ఫిట్ ఇండియా ఉద్యమం వివిధ సందర్భాల్లో క్రీడా మంత్రి కిరెన్ రిజిజు చెప్పిన ప్రాథమిక సిద్ధాంతం, పౌరులు ఖరీదైన మార్గాల్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడటం, ప్రవర్తనా మార్పులను తీసుకురావడం, ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా మార్చడం వంటివి ఉన్నాయి. ప్రధానితో ఈ పరస్పర చర్య దేశ పౌరులలో ఫిట్‌నెస్ పట్ల దృఢనిశ్చయాన్ని బలోపేతం చేస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

click me!