కీలక బిల్లుల ఆమోదం: రాజ్యసభ నిరవధిక వాయిదా

By narsimha lodeFirst Published Sep 23, 2020, 4:01 PM IST
Highlights

కార్మిక సంస్కరణలకు సంబంధించిన నాలుగు ప్రధాన బిల్లుల్లో మూడు కీలకమైన బిల్లులను రాజ్యసభ బుధవారం నాడు ఆమోదించింది. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు  రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాయి. 


న్యూఢిల్లీ: కార్మిక సంస్కరణలకు సంబంధించిన నాలుగు ప్రధాన బిల్లుల్లో మూడు కీలకమైన బిల్లులను రాజ్యసభ బుధవారం నాడు ఆమోదించింది. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు  రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో రాజ్యసభలో అధికార పక్షం ఈ బిల్లులను ఆమోదించుకొంది.

విపక్షాలు నిన్నటి నుండి ఉభయ సభలను బహిష్కరించాయి. అంతేకాదు వివాదాస్పద బిల్లులను పాక్ చేయవద్దని కోరుతూ విపక్ష ఎంపీలు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు లేఖ కూడ రాశాయి.

ఈ బిల్లులను ఆమోదించడం ప్రజాస్వామ్యానికి మచ్చగా ఉంటుందని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఆదివారం నాడు వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో పాస్ కావడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

విపక్ష సభ్యుల సవరణలను ఇతర డిమాండ్లను పట్టించుకోకుండానే ఈ బిల్లులను పాస్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.కరోనా కారణంగా నిర్ణీత షెడ్యూల్ కంటే రాజ్యసభను ఇవాళ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా ఛైర్మె్న ప్రకటించారు.

ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ 2020 , కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 బిల్లులను నిన్న లోక్ సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం పూర్తైతే ఇవి చట్టరూపంలోకి మారుతాయి.

కార్మికులకు సామాజిక భద్రతను కల్పించేందుకు వీలుగా కార్మిక చట్టాల్లో సంస్కరణలకు కేంద్రం పూనుకొంది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖమంత్రి సంతోష్ గంగ్వార్ ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలకు చెందిన పార్టీల ఎంపీలు బుధవారం నాడు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ  విగ్రహాం నుండి అంబేద్కర్ విగ్రహాం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ  ఈ ర్యాలీ చేశారు.కార్మిక చట్టాల్లో సంస్కరణలతో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఈ చట్టాలు దోహదపడుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.  

also read:రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు: రాష్ట్రపతికి హరివంశ్ సింగ్ లేఖ

విపక్షాలు, కార్మిక సంఘాలు  ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిరసన తెలిపే హక్కుపై కూడ ఆంక్షలు విధిస్తున్నాయని అభిప్రాయపడుతున్నాయి. 60 రోజుల ముందు నోటీసులు లేకుండా సమ్మె వెళ్లడానికి కార్మికులకు వీలుండదు. విద్యుత్, వాటర్, గ్యాస్, టెలికం తదితర సంస్థల్లో పనిచేసే కార్మికులకు కూడ ఇదే నిబంధన వర్తించనుంది.

సామాజిక భద్రత బిల్లు ఉబేర్, ఓలా, స్విగ్గి, జోమాటో వంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేసే కార్మికులకు వర్తించనుంది.బీజేపీకి అనుబంధంగా ఉన్న బీఎంఎస్ కూడ  లేబర్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.గత ఏడాది జూన్ లో ప్రభుత్వం ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు కుదించాలని నిర్ణయం తీసుకొంది.

విదేశీ కంపెనీలు ఇండియాలో సంస్థల నిర్వహణకు గాను ఈ సంస్కరణలు దోహాదపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

click me!