ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితిపై ఆరాతీశారు. ఎప్పటికప్పుడు తనకు పరిస్తితి వివరించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.
ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు, క్రికెట్ వరల్డ్ కప్ లాంటి అనేక కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ తర్వాత ప్రధానమంత్రి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం, రోజు మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు తనకు అప్ డేట్ చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ఉత్తరఖండ్ : ఉత్తరకాశీ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక పెద్ద పురోగతి సాధించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు పెద్ద మొత్తంలో ఘనాహారాన్ని, నీటిని పంపడానికి అధికారులు 57 మీటర్ల పొడవు, 6 అంగుళాల వెడల్పు గల పైపును చొప్పించగలిగారు. మొదటి విజువల్స్‌లో సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను లెక్కించినట్లు కనిపిస్తుంది. కార్మికులను లెక్కించడానికి, సొరంగం అంతర్గత భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సొరంగంలోకి కెమెరా చొప్పించారు.
Uttarkashi Tunnel first visuals : చిక్కుకున్న కార్మికులకు కిచిడీ, నీళ్ల బాటిళ్లు..(విజువల్స్)
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను పంచుకుంటూ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఎక్స్ లో పోస్ట్ చేసింది. “సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ప్రత్యక్ష చిత్రాలను కూడా మీరు చూడవచ్చు. ఎండోస్కోప్ కెమెరాను సొరంగంలోకి పంపించారు. సొరంగం లోపల కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు.
చిక్కుకుపోయిన కార్మికుల తర్వాత తొలిసారిగా సోమవారం నాడు వారికి వేడి వేడి కిచ్డీని అందించారు. 6-అంగుళాల ప్రత్యామ్నాయ లైఫ్‌లైన్ ద్వారా స్థూపాకార సీసాలలో ఖిచ్డీ అందించారు. టన్నెల్ భాగంలో విద్యుత్, నీరు అందుబాటులో ఉన్నాయి. కార్మికులకు 4-అంగుళాల కంప్రెసర్ పైప్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలు, మందులు అందించాయి.
నవంబర్ 12 న, సొరంగం సిల్క్యారా వైపున 60 మీటర్ల విస్తీర్ణంలో బురద పడిపోవడం వల్ల సిల్క్యారా నుండి బార్కోట్ వరకు నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఇంతలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రెండు రోబోటిక్స్ యంత్రాలు - 20 కిలోలు, 50 కిలోల బరువుతో సైట్‌కు చేరుకున్నాయి.
చిక్కుకున్న కార్మికుల్లో జార్ఖండ్‌కు చెందిన 15 మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది, ఒడిశాకు చెందిన ఐదుగురు, బీహార్‌కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు, ఉత్తరాఖండ్, అస్సాంకు చెందిన ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒకరు ఉన్నారు.