పుణెలో ప్రధాని టూర్: ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్

Published : Aug 01, 2023, 12:51 PM ISTUpdated : Aug 01, 2023, 01:41 PM IST
  పుణెలో ప్రధాని టూర్: ఒకే వేదికపై  మోడీ, శరద్ పవార్

సారాంశం

పుణెలో జరిగిన కార్యక్రమంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో కలిసి వేదికను పంచుకున్నారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్సీపీ  చీఫ్  శరద్ పవార్ లు  మంగళవారంనాడు  ఒకే వేదికను పంచుకున్నారు.పుణెలో జరిగిన  లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రధానోత్సంలో  ముఖ్యఅతిథి  శరద్ పవార్ తో  మోడీ  పాల్గొన్నారు.  అజిత్ పవార్  నేతృత్వంలో  ఎన్సీపీ వర్గం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది.  ఎన్సీపీలో చీలిక తర్వాత    శరద్ పవార్  మోడీతో వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.పుణెలో  జరిగిన ఈ కార్యక్రమంలో శరద్ పవార్ తో ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు ఇద్దరు  మాట్లాడుకున్నారు.మోడీకి  లోకమాన్య అవార్డును  ప్రధానం చేసింది తిలక్ పౌండేషన్. ఈ కార్యక్రమంలో  పాల్గొనేందుకు  మోడీ ఇవాళ  పుణె వచ్చారు.

దేశ పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ప్రతి ఏటా లోకమాన్య  తిలక్ జాతీయ అవార్డులను  అందిస్తారు. ప్రతి ఏటా ఆగస్టు  1వ తేదీన ఈ అవార్డును  అందిస్తారు. ఈ కార్యక్రమంలో  శరద్ పవార్ పాల్గొనడాన్ని  శివసేన ఉద్ధవ్ ఠాక్రే  సహా వంటి పార్టీలు విమర్శలు చేశాయి. మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోవద్దని శరద్ పవార్ కు  ఇతర పార్టీల నేతలు  సూచించారు.

అయితే  ఈ సూచలను  శరద్ పవార్ పట్టించుకోలేదు.  మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్,  సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,  అజిత్ పవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.విపక్షాల  కూటమిలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది.  గత మాసంలో  బెంగుళూరులో జరిగిన విపక్షాల కూటమి ఇండియా సమావేశానికి శరద్ పవార్ కూడ హాజరయ్యారు . 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu