కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు.. ప్రధాని మోదీ ఏరోజు మాట్లాడతారంటే..

Published : Aug 01, 2023, 12:48 PM IST
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు.. ప్రధాని మోదీ ఏరోజు మాట్లాడతారంటే..

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి కూడా ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలను నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని చెప్పారు. అయితే తాజాగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 8,9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. 

ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి తరఫున అస్సాంలోని కలియాబోర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం (జూలై 15) రోజున లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. 

అయితే ప్రస్తుతం లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి అనుకూలమైన మెజారిటీ ఉంది. అయితే మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం కోరేందుకే లోక్‌సభలో అధికార పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానం ఒక మార్గమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీంతో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? దీనిపై చర్చ ఏ విధంగా ఉంటుంది? ఓటింగ్ ఎలా జరుగుతుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌