
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో (Ram Nath Kovind) సమావేశం అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశం అనురిస్తున్న వైఖరితో పాటు పలు అంశాలపై రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించినట్టుగా సమాచారం. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను.. ముఖ్యంగా విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా గురించి రాష్ట్రపతికి మోదీ వివరించనున్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మోదీ కోవింద్‌కు వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు. అలాగే పోలాండ్, స్లోవేకియాలకు చేరుకున్న భారతీయులను తరలింపును ప్రారంభించనున్నారు.
ఆరోగ్య వనం ప్రారంభించిన రాష్ట్రపతి..
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ‘ఆరోగ్య వనం’ను రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించారు. ఆయుర్వేద మొక్కల ప్రాముఖ్యత, మానవ అవయవాలపై వాటి ప్రభావాలను ప్రచారం చేసే లక్ష్యంతో ఆరోగ్య వనం రూపొందించబడింది. ఇది ఇప్పుడు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉండనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భారతీయుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో మరింత సమన్వయంతో వ్యవహరించేందుకు.. నలుగురు కేంద్ర మంత్రులను ప్రత్యేక దూతలుగా అక్కడి పంపాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా.. రొమేనియా, మాల్దోవాల నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు స్లొవేకియాకు, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్ పురి హంగరీకి, కేంద్ర రోడ్డు, రవాణా, విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ పోలండ్ వెళ్తారు. వీలైనంత త్వరగా కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.