తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిరోజు.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్...

Published : Mar 01, 2022, 12:22 PM IST
తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిరోజు.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్...

సారాంశం

నేడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి M.K.Stalin పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ తమిళంలోనూ శుభాకాంక్షలు తెలపడం విశేషం. అంతేకాదు ఆయన ఆయురారోగ్యాలతో, శాంతిగా, దీర్థాయుష్సుతో ప్రజాసేవలో గడపాలని కాంక్షించారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బర్త్ డే విషెస్ చెబుతూ... కేసీఆర్ రాష్ట్రాల హక్కుల కోసం, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు అంటూ  కితాబునిచ్చారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి M K Stalin నివాసానికి ఫేక్ Bomb threat కాల్ చేసిన ఓ Disabledని పోలీసులు అరెస్ట్ చేశారు. 28 ఏళ్ల ఈ యువకుడిని గ్రేటర్ చెన్నై పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. శనివారం నాడు చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు ఓ కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టామని.. త్వరలో అది పేలుతుందని సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు Bomb Detection Squadను రంగంలోకి దించారు. 

వెంటనే ముఖ్యమంత్రి నివాసంలో డిటెక్షన్ స్క్వాడ్‌, స్నిఫర్ డాగ్‌లతో క్షుణ్ణంగా Searches నిర్వహించారు. రెండు గంటలపాటు బాంబు కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు, బాంబు దొరకకపోవడంతో ఆ ఫోన్ Fake Call అని గుర్తించారు. వెంటనే ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. ఆ తరువాత కాల్ మీద ఆరా తీశారు. కంట్రోల్ రూంకు వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు ఆ కాల్ చెంగల్‌పేటనుంచి వచ్చినట్టుగా గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు నిందితుడిని తిరుపోరూర్ సమీపంలోని వడపోరుందవాక్కం గ్రామానికి చెందిన అయ్యప్పన్ (28)గా గుర్తించారు.

అయ్యప్పన్ తీవ్ర మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఇస్తామన్న ఇళ్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇలా కాల్ చేశానని పోలీసులకు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితిని, తన దుస్థితిని తెలుపుతూ ఇంటి కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నానని.. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయమై అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు.

గతంలో కూడా కోయంబేడు బస్‌ టెర్మినస్‌లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆ సమయంలో అతని కాల్ తో అప్రమత్తమైన పోలీసులు బస్ టెర్మినల్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో కూడా అతడు బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. అతడిపై సీఎంబీటీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలోనే బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేయడంతో..జిల్లాలో అతడిపై మరేదైనా కేసులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu