50వేల కోట్లతో వలస కార్మికులకోసం కొత్త పథకం : ప్రధాని మోడీ

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 1:02 PM IST
Highlights

ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం  'గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన' పేరుతో నేడు శనివారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. 

కరోనా మహమ్మారి కరాళనృత్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఎందరో ఉపాధులను కోల్పోయారు. చాలా మంది తిరిగి వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అలా ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం  'గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన' పేరుతో నేడు శనివారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. 

బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. 

దేశవ్యాప్తంగా వలసకూలీలు అధికంగా తిరిగివచ్చిన జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలియవస్తుంది. వలస కూలీలు అధికంగా తిరిగి వచ్చిన 116 జిల్లాలకు మొదట ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 

ఈ పథకం కింద బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను మొదటివిడతలో ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలిపారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 

25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని అన్నారు. 

click me!