కరోనా గుదిబండ: ధార్వాడ్ పేడ విలవిల

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 11:25 AM IST
Highlights

కరోనా దెబ్బకు ధార్వాడ్ పెడా అమ్మకాలపై తీవ్రమైన దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో దుకాణాలను మూసి వేశారు. ఆ తరువాత అక్కడ పనిచేసేవారంతా కూడా నెమ్మదిగా ఇండ్లకి వెళ్లిపోయారు. 

దూద్ పేడాలు ఎన్నున్నా అందులో ధార్వాడ్ పేడ రుచే వేరు. పాలల్లోని చిక్కదనం, యాలకుల్లోని కమ్మదనం మనం ఆస్వాదించవచ్చు. తింటుంటే....ఆ రుచి ఆ మాధుర్యం మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ఆ పేడాను నోట్లో వేసుకుంటే... అదేదో సినిమాలో అన్నట్టుగా స్వర్గలోకపు అంచులదాకావెళ్లి వస్తారు పెడా ప్రియులు. 

 కరోనా దెబ్బకు ధార్వాడ్ పెడా అమ్మకాలపై తీవ్రమైన దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో దుకాణాలను మూసి వేశారు. ఆ తరువాత అక్కడ పనిచేసేవారంతా కూడా నెమ్మదిగా ఇండ్లకి వెళ్లిపోయారు. 

అప్పటికే తయారైన స్టాక్ అంతా మూలకు పడిపోయింది. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కొనసాగడంతో... ఆ పేడా అంతా పాడయిపోయింది. ఆ లాక్ డౌన్ దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ కూడా పడకేయడంతో.... అమ్మకాలు లేక వ్యాపారాలు బాగా డల్ అయ్యాయని వ్యాపారాలు లబోదిబోమంటున్నారు. 

ఈ ధార్వాడ్ పేడా వెనుక ఒక పెద్ద కథ దాగి ఉంది. ఈ హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన అవాద్ బిహారి అనే వ్యక్తి వలస వచ్చాడు. ఇక్కడ అధికంగా లభ్యమయ్యే పాలతో పేడా  తయారుచేసి అమ్మేవాడు. 

గిరాకీ బాగా ఉండడంతో 1955లో పేడా ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇప్పుడు వారి మూడవ తరం వారు ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. కర్ణాటక అంతటా పేడా లభ్యమవుతున్నప్పటికీ... ధార్వాడ పేడాకు సాటిరాదని అభిమానులు అంటుంటారు. 

ఇకపోతే... భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భారీగానే ఉంది. రోజుకి దాదాపు 500కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో 7వేలు దాటేసింది. దాదాపు 8వేలకు చేరువలో ఉంది. 

click me!