సైనికుడి తండ్రి వీడియోతో రాహుల్ కి అమిత్ షా చురకలు

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 11:44 AM IST
Highlights

చైనాతో సరిహద్దు వివాదంలో 20 మంది సైనికులు మరణించడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్న రాహుల్ గాంధీ పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఇలాంటి క్లిష్టసమయంలో రాజకీయాలు తగవని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. 

చైనాతో సరిహద్దు వివాదంలో 20 మంది సైనికులు మరణించడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్న రాహుల్ గాంధీ పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఇలాంటి క్లిష్టసమయంలో రాజకీయాలు తగవని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. 

ఏఎన్ఐ ట్వీట్ చేసిన ఒక వీడియోలో ఒక వీర జవాన్ తండ్రి తన కొడుకు సరిహద్దులో మరణించాడని, ఆయన సరిహద్దులో పోరాడుతూనే ఉంటాడని, ఈ విషయంలో రాజకీయాలు వద్దు అని ఒక సైనికుడి తండ్రి రాహుల్ గాంధీ హితవు పలికాడు. ఈ వీడియో ఎక్కడిది అనే విషయంలో క్లారిటీ లేదు. 

ఈ వీడియోను జత చేస్తూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డాడు అమిత్ షా. ఒక సాహస వీరజవాన్ల రాహుల్ గాంధీకి మెసేజ్ ఇస్తున్నాడు. దేశమంతా ఒక్కతాటిపై ఉంటె... రాహుల్ గాంధీ కూడా నీచ రాజకీయాలను వీడి దేశంకోసం నిలబడాలి" అని అమిత్ షా ట్వీట్ చేసారు. 

20 మంది సైనికులు మరణించినప్పటినుండి రాహుల్ గాంధీ ప్రతిరోజు ప్రధాని నరేంద్రమవుడిని మనసైనికులు ఎందుకు, ఎక్కడ మరణించారు? అనే ప్రశ్నను నిర్విరామంగా అడుగుతూనే ఉన్నాడు ఈ వాయనాడ్ ఎంపీ. 

ఇకపోతే... భారత సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గాల్వాన్‌లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన ఏ ఒక్క పోస్టునూ చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న ప్రధాని.. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని తెలిపారు.

చైనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన మోడీ.. భారత్ శాంతి కోరుకుంటోందని, కానీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా.. ఈ అఖిలపక్ష సమావేశంలో 20 మంది పార్టీ నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఘర్షణలకు ముందు, తర్వాత పరిస్థితిని ఆయన వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. చైనీయులు ప్రవేశించడానికి తాము ఒప్పుకోమని ఆమె స్పష్టం చేశారు. 

click me!