వారణాసి పర్యటనలో ప్రధాని.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభించిన మోడీ

By telugu team  |  First Published Oct 25, 2021, 4:54 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో ఉన్నారు. ఈ రోజు వారణాసిలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను ప్రారంభించారు. దీంతోపాటు ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది మెడికల్ కాలేజీలనూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య  మంత్రి మన్సుఖ్ మాండవీయా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లూ పాల్గొన్నారు.
 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని Varanasi పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో Prime Minister చేస్తున్న ఈ పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వారణాసిలో ఆయన ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను PM Narendra Modi ప్రారంభించారు. నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనంగా దేశంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయనున్న అతిపెద్ద స్కీమ్ ఇదని ప్రధానమంత్రి కార్యాయలం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా పది హైఫోకస్ రాష్ట్రాల్లో 17,788 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్‌లకూ ఈ పథకం ఊతమివ్వనుంది. సిద్ధార్థనగర్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆన్‌లైన్‌లో రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, Uttar Pradesh గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లు పాల్గొన్నారు.

ఐదువేల కోట్ల అంచనా వ్యయమున్న ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70ఏళ్లలో ఒక్క పార్టీ కూడా దేశంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేదని అన్నారు. హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ పెంచనేలేదని చెప్పారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలోని తమ ప్రభుత్వం దేశం భవిష్యత్‌లో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోనే సామర్థ్యంతో ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కేవలం 17,788 రూరల్ హెల్త్, వెల్‌నెస్ సెంటర్లను సపోర్ట్ చేయడమే కాదు.. మరో 11,024 పట్టణ ఆరోగ్య, వెల్‌నెస్ సెంటర్లను అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు వివరించారు. 

Latest Videos

undefined

Also Read: టీకా తయారీదారులతో ప్రధాని భేటీ.. ‘నరేంద్ర మోడీకి థాంక్స్’

ఉత్తరప్రదేశ్‌లో రూ. 2,329 కోట్లతో తొమ్మిది మెడికల్ కాలేజీలను నిర్మించారు. సిద్ధార్థనగర్, ఇటా, హర్దోయ్, ప్రతాప్‌గడ్, ఫతేపూర్, డియోరియా, ఘాజీపూర్, మిర్జాపూర్, జాన్‌పుర్ జిల్లాల్లో వీటిని నిర్మించగా, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రధానంగా ప్రజా ఆరోగ్య సదుపాయాల్లోని లోపాలను పూడ్చనుంది. ముఖ్యంగా క్రిటికల్ కేర్ ఫెసిలిటీలు, ప్రైమరీ కేర్‌లలోని లోపాలను సరిచేయనుంది. దేశంలో ఐదు లక్షల జనాభాకు మించిన అన్ని జిల్లాల్లో ఈ మిషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్కీమ్ కింద ఒక నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ హెల్త్, నాలుగు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీలు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియ ప్రాంతంలో భాగంగా తొమ్మిది బయోసేఫ్టీ లెవెల్3 ల్యాబ్‌లను, ఐదు రీజనల్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లనూ ఏర్పాటు చేయనున్నారు.

click me!