కాన్పూర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం యోగితో కలిసి ప్రయాణం, ఫోటోలు వైరల్

Siva Kodati |  
Published : Dec 28, 2021, 04:00 PM ISTUpdated : Dec 28, 2021, 04:02 PM IST
కాన్పూర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం యోగితో కలిసి ప్రయాణం, ఫోటోలు వైరల్

సారాంశం

ప్రతిష్టాత్మక కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను (kanpur metro inauguration) జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi). ఈ సందర్భంగా ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ (yogi adityanath)మెట్రోలో ప్రయాణించారు. 

ప్రతిష్టాత్మక కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను (kanpur metro inauguration) జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi). ఈ సందర్భంగా ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ (yogi adityanath)మెట్రోలో ప్రయాణించారు. దీనితో పాటు బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ విభాగాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. కాన్పూర్ అర్బన్ ఏరియాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

 

 

కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొత్తం 9 కి.మీ పొడవు. ఐఐటి కాన్పూర్ నుండి మోతీ జీల్ వరకు ఇది విస్తరించి ఉంది. అయితే ప్రతిపాదిత ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కి.మీ. దీనిని రూ. 11,000 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో ప్రాజెక్టుగా కాన్పూర్ మెట్రో అవతరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

 

ఇక అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 54వ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో పాల్గొని (iit kanpur convocation) ప్రసంగించారు. రాబోయే యుగం విద్యార్థులకు సువర్ణవకాశమని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా (startup hub ) అవతరించిందని.. ఇది ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థుల వల్లే సాధించినట్లు ప్రధాని మోదీ ప్రశంసించారు.

 

 

కాలేజీ నుంచి బయటకి అడుగు పెట్టగానే విద్యార్థులు విజయానికి షార్ట్‌కట్‌లతో ఆలోచిస్తారని ఆయన అన్నారు. చాలా మంది కంఫర్ట్ కోసం అన్వేషిస్తారని.. కంఫర్ట్ కంటే ఛాలెంజ్ ఎంచుకోవాలని మోడీ విద్యార్ధులకు సూచించారు. సవాళ్లను ఎదుర్కొని వాటిని సమర్ధవంతమైన పరిష్కారాలతో అధిగమించే వారే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన గుర్తుచేశారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్