71 ఏళ్ల వయసులో జిమ్‌లో ప్రధాని మోడీ వర్కౌట్లు.. వీడియో వైరల్

By Siva KodatiFirst Published Jan 4, 2022, 3:31 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఆరోగ్యానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్‌ (RSS) నుంచి రావడంతో యోగ, ఉదయాన్ని పూజలు వంటి అలవాట్లు ఆయనకు అలవడ్డాయి. ఇప్పటికీ ఆయన ఉదయాన్నే లేచి యోగ, ఇతర వ్యాయామాలు చేస్తూ వుంటారు.

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఆరోగ్యానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్‌ (RSS) నుంచి రావడంతో యోగ, ఉదయాన్ని పూజలు వంటి అలవాట్లు ఆయనకు అలవడ్డాయి. ఇప్పటికీ ఆయన ఉదయాన్నే లేచి యోగ, ఇతర వ్యాయామాలు చేస్తూ వుంటారు. తాజా 71 ఏళ్ల వయస్సులోనూ ప్రధాని నరేంద్ర మోడీ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు.  ‘ఫిట్ ఇండియా’ (fit india) అనే సందేశం ఇస్తు జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి (major dhyan chand sports university) ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్నిస్తు కసరత్తులు చేశారు. ప్రధాని మోడీ జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని పార్టీలు  ఈ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించి.. ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల స‌మరం మాములుగా లేదు. మ‌ళ్లీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాలు జ‌రుపుతోంది. ఆయా కార్య‌క్ర‌మాల్లో బీజేపీ అగ్ర‌నేత‌లంద‌రూ పాల్గొంటున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని నేత‌లంద‌రూ వ‌రుస పెట్టి యూపీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. 

Also Read:UP Elections 2022: ఒక‌ప్పుడు నేర‌స్తుల‌కు అడ్డా.. నేడు క్రీడాకారుల గ‌డ్డ.. ! :ప్ర‌ధాని మోడీ

ఆదివారం నాడు ప్ర‌ధాని మోడీ సైతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. మీరట్‌లోని సర్ధనలో స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ఇందుకు ముందు కొన‌సాగిన ప్ర‌భుత్వాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌వాలు విసురుతూ.. బ‌లంగా నిల‌బ‌డుతున్న స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రధానంగా టార్గెట్ చేసి.. విమ‌ర్శ‌లు చేశారు.

ఒక‌ప్పుడు నేర‌స్థుల‌కు అడ్గాగా ఉన్న ఈ ప్రాంతం ప్ర‌స్తుతం క్రీడాకారుల‌కు గ‌డ్డ‌గా మారుతున్న‌ద‌ని అన్నారు.  నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని అన్నారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు. సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందేద‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వారితో టోర్నమెంట్‌లను ఆడుతూ బిజీగా ఉండేవారన్నారు. అయితే, రాష్ట్రంలో సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ నేర‌గాళ్ల‌ను  ‘జైలు’లో పెట్టి అడుకుంటున్నార‌ని అన్నారు. యోగి ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. 

click me!