ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు రూ. 2.23 కోట్లు.. చరాస్తులు ఎంత పెరిగాయి?

By Mahesh KFirst Published Aug 9, 2022, 6:53 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు రూ. 2.23 కోట్లు అని ప్రధాని కార్యాలయం వెబ్‌సైట్ వెల్లడించింది. ఆయనకు స్తిరాస్తి లేదు. చాలా వరకు బ్యాంకు డిపాజిట్ల రూపంలో చరాస్తులు ఉన్నాయి. నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సుమారు రూ. 2.23 కోట్లు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా బ్యాంకు డిపాజిట్లుగానే ఉన్నాయి. చరాస్తులు మినహా.. స్థిరాస్తులు ప్రధాని మోడీకి లేవు. గాంధీ నగర్‌లో ప్రధాని మోడీకి భూమి ఉండేది. కానీ, ఆ భూమిని ఆయన డొనేట్ చేయడంతో ప్రస్తుతం ఆయనకు స్తిరాస్తి లేకుండా పోయింది.

ఇవి మినహా ఆయన ఏ బాండ్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు, షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఆయన పెట్టుబడులు పెట్టలేదు. కానీ, ఆయనకు నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.73 లక్షలుగా ఉన్నది. మార్చి 31వ తేదీ వరకు ప్రధాని మోడీ దగ్గర ఉన్న ఆస్తులు ఇవే. ఈ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవలే వెల్లడించింది.

2022 మార్చి 31వ తేదీ నాటికి ప్రధాని మోడీ చేతిలో రూ. 35,250 ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో నేషనల సేవింగ్స్ సర్టిఫికేట్స్ రూ. 9,05,105 ఉన్నాయి. ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల విలువ రూ. 1,89,305గా ఉన్నది. 

ఈ ఆస్తుల వివరాలు గతేడాది పోల్చి చూద్దాం. ప్రధాని మోడీ చరాస్తులు గతేడాది కంటే రూ. 26.13 మేరకు పెరిగాయి. కానీ, స్తిరాస్తులు మాత్రం సుమారు రూ. 1.1 కోట్లు కోల్పోయారు. గతేడాది మార్చి 31వ తేదీన వెల్లడించిన వివరాలతో పోల్చితే ఈ తేడాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఏడాది మార్చి 21వ తేదీ నాటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు రూ. 2,23,82,504లుగా ప్రధాని కార్యాలయం వెబ్‌సైట్‌ వెల్లడించింది.

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 అక్టోబర్‌లో ముగ్గురు ఇతర యజమానులతో కలిసి ఉమ్మడిగా ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. వారంతా సమాన వాటాలతో కొనుగోలు చేశారు. కానీ, ప్రధాని మోడీ తన వాటాను విరాళం ఇచ్చారు. కాబట్టి, ఇప్పుడు ప్రధాని పేరిట భూమి లేదు.

అలాగే, ప్రధాని మోడీతోపాటు ఆయన క్యాబినెట్ కొలీగ్స్ కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. అందులో రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ పేరిట రూ. 2.54 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే, రూ. 2.97 కోట్ల స్తిరాస్తులు ఉన్నాయి. ఈ వివరాలు 2022 మార్చి 31వ తేదీ నాటికి సంబంధించినవి. 

ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్, హర్దీప్ సింగ్ పురి, పర్షోత్తమ్ రూపాలా, జీ కిషన్ రెడ్డి సహా 29 మందవి క్యాబినెట్ మంత్రులు తమ సొంత, అలాగే, తమ పై ఆధారపడిన వారి ఆస్తులనూ గత ఆర్థిక సంవత్సరం వెల్లడించారు. ఇందులో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఉన్నాడు. కానీ, ఆయన జులైలో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.

click me!