ప్రొఫెసర్ బికినీ పిక్స్ స్టూడెంట్ చూశాాడని రూ. 99 కోట్లు డిమాండ్ చేసిన వర్సిటీ

By Mahesh KFirst Published Aug 9, 2022, 5:30 PM IST
Highlights

తమ కొడుకు ప్రొఫెసర్ బికినీ పిక్ చూశాడని ఆ తల్లిదండ్రులు యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యాజమాన్యం ఒక కమిటీ వేసి ఆమెను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. ఆమె వ్యవహారంతో కాలేజీ పూడ్చుకోలేని నష్టాన్ని చవిచూసిందని పేర్కొంది. అనంతరం ఆమె రాజీనామా చేసి న్యాయపోరాటానికి దిగారు. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ తన బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్. ఎందుచేతనో ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. ఓ రోజు ఆ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఒకరు ఆ ఫొటోలు చూస్తూ తల్లిదండ్రులకు దొరికాడు. తమ కొడుకు ప్రొఫెసర్ బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో చూడటం తాము చూశామని, ఆ ప్రొఫెసర్ అలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ శోచనీయం అంటూ యూనివర్సిటీ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. ఆ లేఖ తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్‌ను ఫైర్ చేసింది. బలవంతంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసింది. యూనివర్సిటీకి చేసిన నష్టానికి రూ. 99 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇది కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఘటన అని ఇండియా టుడే ఓ కథనం వెలువరించింది.

తమ 18 ఏళ్ల కుమారుడు చదువు చెబుతున్న ప్రొఫెసర్ బికినీ పిక్స్ చూశాడని, ఆమె అలా పొట్టి డ్రెస్సుల్లోని ఫొటోలను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్టు చేయడం దారుణం అని, డిగ్రీ స్టూడెంట్ తల్లిదండ్రులుగా తమకు సిగ్గుచేటుగా ఉన్నదని కాలేజీ యాజమాన్యానికి లెటర్ రాశారు. తమ కుమారుడిని అలాంటివి చూడకుండా తాము వీలైనంత కాపాడామని, కానీ, ఆమె పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యంగా కనిపిస్తున్న ఫొటోలు పోస్టు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీంతో ఓ కమిటీ సదరు ప్రొఫెసర్ కు సమన్లు పంపంది. ఆమె కమిటీ ముందు హాజరవ్వగా.. ఆమె పై వచ్చిన ఫిర్యాదు లేఖను చదివి వినిపించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా దిగిపోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని బాధితురాలు తెలిపింది. అక్టోబర్ 2021న రాజీనామా చేసినట్టు పేర్కొంది.

వారు అసభ్యంగా ఉన్నదని చెబుతున్న ఫొటో కేవలం పోస్టు కాదని, అదొక స్టోరీ అని వివరించింది. అది కూడా ఆ యూనివర్సిటీ తనకు ఆఫర్ ఇవ్వడానికి ముందే ఆ ఫొటో పోస్టు అయిందని తెలిపింది. తన ప్రొఫైల్ ప్రైవేట్ అని, ఆ ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో తనకు తెలియడం లేదని ఆమె చెప్పింది. డ్రెస్ కోడ్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నదని కమిటీ తనకు తెలుపగా.. అది కేవలం యూనివర్సిటీ ప్రాంగణం వరకే పరిమితంగా ఉంటాయని ఆమె సమాధానం చెప్పినట్టు వివరించింది.

తాను రాజీనామా చేయడానికి ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను యూనివర్సిటీలో నుంచి డిస్మిస్ చేసిన విధం సెక్సువల్ హరాస్‌మెంట్, ఉద్దేశపూర్వక క్యారెక్టర్ అసాసినేషన్ అని వివరించింది. కాలేజీ యాజమాన్యం తనకు క్షమాపణలు చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవసరమైతే తాను కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నట్టు పేర్కొంది.

click me!