జేడీ(యూ)-బీజేపీ చీలిక మంచిది కాదు.. ఆర్జేడీతో పొత్తు ఎక్కువ కాలం ఉండదు - ఆర్ఎల్జీపీ అధ్య‌క్షుడు పశుపతి పరాస్

By team teluguFirst Published Aug 9, 2022, 5:59 PM IST
Highlights

ఎన్డీఏ కూటమి నుంచి ఆర్జేడీ వైదొలగడం బీహార్ అభివృద్ధికి అంత మంచిది కాదని ఆర్ఎల్జీపీ అధ్యక్షుడు పశుపతి పరాస్ అన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోవడానికి కారణం నితీష్ కుమార్ కు మాత్రమే తెలుసని ఆయన తెలిపారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొల‌గాల‌ని నిర్ణయించుకున్నప్పటికీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) భారతీయ జనతా పార్టీ (BJP)తోనే ఉంటుందని మంగ‌ళ‌వారం ప్రకటించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ వార్తా సంస్థ ANIతో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జేడీ(యూ), ఆర్జేడీలు ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేవ‌ని అన్నారు. 

ప్రొఫెసర్ బికినీ పిక్స్ స్టూడెంట్ చూశాాడని రూ. 99 కోట్లు డిమాండ్ చేసిన వర్సిటీ

‘‘ ఇంతకు ముందు కూడా RJD, JD(U) మధ్య ఒక ప్రయోగం జరిగింది. కానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. మళ్లీ అలాంటి పొత్తు రావడం బీహార్ అభివృద్ధికి మంచి సంకేతం కాదు. మా పార్టీ ఎన్డీఏలో ఒక భాగంగా ఉంటుందని మేము నిర్ణయించుకున్నాము. ’’ అని పశుపతి పరాస్ అన్నారు. 

సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తరువాత పశుపతి పరాస్ ‘టౌమ్స్ నౌ’తో మాట్లాడారు. నితీష్ కుమార్ నిర్ణయం బీహార్‌కు అనుకూలంగా లేదని అన్నారు. ఎన్డీఏ కూట‌మిలో ఈ బ్రేక్ రాష్ట్ర అభివృద్ధికి అవరోధమని తెలిపారు. ఎన్డీయే నుంచి విడిపోవడానికి గల కారణం నితీష్ కుమార్‌కు మాత్రమే తెలుసని, బీజేపీకి వ్యతిరేకంగా కేకలు వేయడం బూటకమని పరాస్ అన్నారు. 

కోవిడ్ -19 కేసుల పెరుగుద‌ల‌పై భయపడాల్సిన అవసరం లేదు - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

RLJP నాయకుడు, లోక్ సభ ఎంపీ ప్రిన్స్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘ మేము ఇతర పార్టీల నిర్ణయాలపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ మేము ఎన్‌డీఏతో ఉన్నాం. మాకు (బీజేపీ) గౌరవం ఇవ్వడం లేదని మేము భావించడం లేదు. దాని గురించి (జేడీయూ) మాత్రమే చెప్పగలరు. ’’ అని ఆయన అన్నారు. బీహార్‌లో అధికార బీజేపీ-జేడీ(యూ) కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న ఊహాగానాలకు తెరదించుతూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 

కోవిడ్ -19 కేసుల పెరుగుద‌ల‌పై భయపడాల్సిన అవసరం లేదు - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

ఇవాళ ఉదయం ఆర్జేడీ, జేడీ యూ పార్టీ ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమయ్యారు. నితీష్ కుమార్ నివాసంలో జేడీ (యూ) నేతలు,  రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ నేతలు కలుసుకున్నారు. ఈ స‌మావేశంలోనే బీజేపీతో ఇక తెగ‌దింపులు జ‌రుపుకుంటున్న‌ట్టు నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో నితీష్ కుమార్ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వెంట ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ద‌వికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆ ప‌త్రాన్ని గవర్నర్ కు అందించారు. త‌మ పార్టీ బీజేపీతో పొత్తును వ‌దులుకుంద‌ని, ఆర్జేడీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. 
 

click me!