
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ, తమిళనాడులో పర్యటించారు. మధ్యాహ్నం ఆయన చెన్నైకి చేరుకున్నారు. సాయంత్రంపూట ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్త తిరు ఎస్ మణికందన్‌ను కలిశారు. ఆయనతో స్పెషల్ సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తిరు ఎస్ మణికందన్ వంటి కార్యకర్త ఉన్న పార్టీలో తాను కార్యకర్తగా ఉండటం గర్వంగా ఉన్నదని ట్వీట్ చేసింది.
తిరు ఎస్ మణికందన్‌తో ఫొటో దిగి దాన్ని ప్రధాని స్వయంగా ట్వీట్ చేశారు. అది స్పెషల్ సెల్ఫీ అని కూడా పేర్కొన్నారు. తాను చెన్నైలో తిరు ఎస్ మణికందన్‌ను కలుసుకున్నానని వివరించారు. ఆయన ఈరోడ్ నుంచి బీజేపీకి గర్వనీయమైన కార్యకర్త అని తెలిపారు. బూత్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నట్టు వివరించారు. ఆయన వికలాంగుడైనా సొంత షాపు నడుపుకుంటున్నాడని తెలిపారు. ఆయనకు వచ్చే లాభాల్లో సింహ భాగం బీజేపీకి అందిస్తాడని వివరించారు.
Also Read: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు.. తృటిలో తప్పిన ప్రమాదం
తిరు ఎస్ మణికందన్ వంటి కార్యకర్తలు ఉన్న పార్టీలో తాను కార్యకర్తగా ఉండటంపై గర్వపడుతున్నట్టు ప్రధాని మోడీ వివరించారు. ఆయన జీవన ప్రయాణం, పార్టీ భావజలానికి ఆయన కమిట్‌మెంట్ రెండూ ప్రేరణ ఇస్తున్నాయని తెలిపారు. ఆయనకు అభినందనలు అని, భావి లక్ష్యాలను సాధించాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.