అమానుషం : అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో వుందని.. చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు, పోలీసులు రాకుంటే

Siva Kodati |  
Published : Apr 08, 2023, 08:29 PM IST
అమానుషం : అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో వుందని.. చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు, పోలీసులు రాకుంటే

సారాంశం

మధ్యప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది.  అన్నాచెల్లెళ్లను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా చావబాదారు గ్రామస్తులు. పోలీసులు వచ్చే వరకు అన్నాచెల్లెళ్లను కొడుతూనే వున్నారు గ్రామస్తులు.

మధ్యప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది.  అన్నాచెల్లెళ్లను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా చావబాదారు గ్రామస్తులు. కారణం వీరిద్దరి క్యారెక్టర్‌పై అనుమానం రావడమే. వివరాల్లోకి వెళితే.. ఖాండ్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు తన చెల్లెలు కళావతిని చూసేందుకు బామండా గ్రామానికి వచ్చి.. పెరట్లో ఒకే మంచంపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆ సమయంలో బాధితురాలి భర్త ఇంట్లో లేడు. ఈ క్రమంలో వీరిద్దరిని చూసిన కొందరు గ్రామస్తులు లేనిపోని అనుమానంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో బంధం వుందన్నట్లుగా పుకార్లు పుట్టించారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు వీరిద్దరిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చావబాదారు. ఇంత జరుగుతున్నా అక్కడున్న ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోకపోగా.. సెల్‌ఫోన్‌లతో వీడియో తీశారు. దీనిపై బంధువులకు సమాచారం అందడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే వరకు అన్నాచెల్లెళ్లను కొడుతూనే వున్నారు గ్రామస్తులు. అనంతరం వీరిద్దరిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ అమానుష ఘటనకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu