Lok Sabha Election 2024:సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగనున్నది. ఈ చివరి సమావేశంలో ప్రధాని మోదీ తన మంత్రులతో ఎలాంటి విషయాలను చర్చించబోతున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల 2024 ప్రకటనకు కొన్ని రోజుల ముందు మార్చి 3న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగనున్నది. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న సుష్మా స్వరాజ్ భవన్‌లో మంత్రి మండలి సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
కీలకమైన విధానపరమైన అంశాలను చర్చించడానికి, వివిధ కార్యక్రమాల అమలుపై ఇన్‌పుట్‌లను కోరడానికి, పాలనకు సంబంధించిన విషయాలపై తన దృక్పథాన్ని పంచుకోవడానికి ప్రధాని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి మంత్రుల మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. అయితే.. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు వివిధ రాష్ట్రాల సన్నాహాలను ఎన్నికల సంఘం సమీక్షించడం ప్రారంభించింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 2014లో మార్చి 5న తొమ్మిది దశల్లో ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 16న ఫలితాలను ప్రకటించింది. 2019 సంవత్సరంలో కమిషన్ ఏడు దశల లోక్‌సభ ఎన్నికలను మార్చి 10న ప్రకటించింది . మే 23న ఫలితాలను ప్రకటించింది.
ఎన్డీయే లక్ష్యం 400కు పైగానే
ఈసారి ఎన్డీయే 400 దాటుతుందని, బీజేపీ 370కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్ తమ లక్ష్యమని అన్నారు. నేడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్‌పై అపూర్వమైన సానుకూలత కనిపిస్తోందని అన్నారు. భారతదేశ వృద్ధి కథనంపై ప్రతి దేశం విశ్వాసంతో, పూర్తి విశ్వాసంతో ఉంది. నేడు దేశంలో మోడీ హామీపై జోరుగా చర్చ జరుగుతోంది. నేడు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని పెట్టుబడులకు కేంద్రంగా పరిగణిస్తోందనీ, తమ ప్రభుత్వం అందరి కోసం. ‘సబ్కా సాథ్, సబ్‌కా వికాస్’ అనే లక్షంతో పని చేస్తుందని అన్నారు.