BJP: భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్( మరో సారి మోదీ సర్కార్)’ పేరుతో రూపొందించిన ప్రచార గీతాన్ని విడుదల చేశారు.
BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి , ప్రచారానికి కోసం బీజేపీ తాజాగా ప్రత్యేక ప్రచార గీతాన్ని విడుదల చేసింది.
భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్( మరో సారి మోదీ సర్కార్)’ పేరుతో రూపొందించిన ప్రచార గీతాన్ని విడుదల చేసింది. సమ్మిళిత అభివృద్ధి అనే థీమ్ రూపొందించిన ఈ పాటను కేవలం హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా 24 భాషల్లో విడుదల చేశారు. ఈ పాటలో ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన పథకాలు, మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారతదేశం సాధించిన ఘనతలతో పాటు దేశంలోని వివిధ రంగాలలో, ప్రాంతాలలో, వివిధ సమూహాలలో, సమాజంలోని వర్గాలలో డెవలప్ మెంట్ ను హైలెట్ చేశారు.
అలాగే.. రైతులు, అసంఘటిత కార్మికులు, మహిళలు, యువత కోసం మోడీ ప్రభుత్వ కృషి, దేశంలోని అపూర్వమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, చంద్రయాన్-3 మిషన్, రామమందిర నిర్మాణం వంటి అసమానమైన విజయాలను కూడా ఈ పాటలో ప్రస్తావించారు. వాస్తవానికి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ప్రచారాన్ని జాతీయ అధ్యక్షుడు JP నడ్డా జనవరి 2024లో ప్రారంభించారు. అలాగే.. బీజేపీ ఈ ఎన్నికల సందర్భంగా www.ekbaarphirsemodisarkar.bjp.org వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా పౌరులు రాబోయే ఎన్నికల్లో శ్రీ నరేంద్ర మోదీకి, బీజేపీకి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.