పార్లమెంట్ లో స్వరాజ్ ఎపిసోడ్ ప్రదర్శన: తిలకించిన మోడీ, మంత్రులు

Published : Aug 17, 2022, 08:24 PM ISTUpdated : Aug 17, 2022, 08:27 PM IST
 పార్లమెంట్ లో స్వరాజ్ ఎపిసోడ్ ప్రదర్శన: తిలకించిన మోడీ, మంత్రులు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లైబ్రరీ భవనంలో స్వరాజ్ సీరియల్ ను   బుధవారం నాడు తిలకించారు.  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని స్వరాజ్ సమగ్ర గాథ ప్రదర్శనకు బుధవారం నాడు సాయంత్రం హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు. దూరదర్శన్  రూపొందించిన స్వరాజ్ సీరియల్ ను ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులు పలువురు పాల్గొన్నారు.
ఇవాళ సాయంత్రం  శివప్ప నాయక, రాణి అబ్బక్కపై రెండు ఎపిసోడ్ లను ప్రదర్శించనున్నారు.

స్వాతంత్య్ర పోరాటం అద్భుతమైన చరిత్రలో ప్రజలకు అంతగా తెలియని కథలను 75 ఎపిసోడ్ లుగా అందించనున్నారు. ఈ నెల 14 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుండి 10 గంటలకు దూరదర్శన్ నేషనల్ చానెల్ ప్రసారం చేయనున్నారు. ఈ సీరియల్ తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాల్, అస్సామీ, ఇంగ్లీష్ లలో డబ్ చేశారు.ఈ నెల 5వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సమక్షంలో స్వరాజ్ సీరియల్ ప్రారంభించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu